ప్రాణం ఉన్నంత వరకు నందమూరి అభిమానులమే. ఘనంగా బాలయ్య బాబు పుట్టినరోజు వేడుకలు

0 17

మంత్రాలయం ముచ్చట్లు:
ప్రాణం ఉన్నంతవరకు నందమూరి వంశం  బాలయ్య బాబు అభిమానులమేనని  మంత్రాలయం తాలుకా  నందమూరి బాలకృష్ణ మరియు యన్టీఆర్ ఫ్యాన్స్ అధ్యక్షుడు మాధవరం శంకరప్ప  పేర్కొన్నారు. జూన్ పదవ తారీకు తెలుగు జాతి ముద్దుబిడ్డ నందమూరి నటసింహం బాక్సాఫీస్ బొనంజా బాలయ్య బాబు పుట్టిన రోజు వేడుకలను మంత్రాలయం మండల పరిధిలోని మాధవరం గ్రామంలో అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. ముందుగా బాలయ్య బాబు పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భం గా మంత్రాలయం తాలూకా ఎన్.బి.కె అండ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అధ్యక్షులు శంకరప్ప మరియు అభిమానులు మాట్లాడుతూ మా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు బాలయ్యబాబు అభిమానులమేనని  తెలియజేశారు. బాలయ్య బాబు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఎంతో మందికి ఉచితంగా సేవ చేస్తున్నారని అలాగే కరోనా సమయంలో హిందూపురంలో నియోజకవర్గంలో ప్రజలందరికీ ఈ వ్యాక్సిన్ను టాబ్లెట్లు ఇతర నిత్యావసర వస్తువులను ఉచితంగా  అందజేశారు అని పేర్కొన్నారు .సేవ  చేయడమే కానీ ప్రచారం చేసుకోవటం  తనకు ఇష్టం లేదని పేర్కొన్నారు. త్వరలో బాలయ్య బాబు బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ  అఖండ మూవీ ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ అభిమానులు  వీరరాజు నరసింహులు సురేష్ మారెప్ప అశోకు తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

- Advertisement -

Tags:As long as there is life, Nandamuri fans.
Glorious Balayya Babu Birthday Celebrations

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page