మళ్లీ సెట్స్ పైకి చిరంజీవి

0 15

హైదరాబాద్   ముచ్చట్లు:
మెగాస్టార్ చిరంజీవి-కొరటాల శివ కాంబినేషన్‌లో మూవీ అనౌన్స్ అయిన దగ్గరి నుండి అభిమానుల్లో అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఓటమంటూ తెలియకుండా, కొరటాల చేసిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ కావడమే ఇందుకు ప్రధాన కారణం. మహేష్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలకు బంపర్ హిట్ ఇచ్చిన ఈ దర్శకుడు.. తమ హీరోకి కూడా అదే రేంజ్ హిట్ ఇస్తారని ఆశగా ఎదురు చూస్తున్నారు మెగా ఫ్యాన్స్.’ఆచార్య’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ అయితే మొదలైంది కానీ ఇప్పటికే పలుసార్లు కరోనా మూలంగా వాయిదా పడుతుండడంతో నీరస పడిపోయిన అభిమానులకు మెగాస్టార్ ఒక గుడ్ న్యూస్ ప్లాన్ చేస్తున్నారు. లాక్ డౌన్ నియమాలు ఇప్పుడిప్పుడే రిలాక్స్ అవుతుండడంతో ‘ఆచార్య’ షూటింగ్ కంటిన్యూ చేయవలసిందిగా కొరటాలను చిరంజీవి కోరినట్టుగా తెలుస్తోంది. కేవలం 15 రోజుల షూటింగ్ బ్యాలన్స్ ఉండడం, అది కూడా రామ్ చరణ్ పార్ట్ మాత్రమే కావడంతో, అది అత్యంత తొందరగా పూర్తి చేయమని కొరటాలను చిరంజీవి కోరినట్లుగా తెలుస్తోంది.ఇక ఆలస్యం చేయకుండా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి అభిమానులను ఆనంద పరచాలనేది మెగాస్టార్ ప్లాన్ అని సమాచారం. కొరటాల అందుకు తగ్గట్లుగా షెడ్యూల్ ప్లాన్ చేసుకుని చిరు ఇచ్చిన డెడ్ లైన్ అందుకునే ప్రయత్నాల్లో ఉన్నారట. ఇప్పటికే విడుదలైన ప్రమోషన్ వీడియోలు, చిరంజీవి లుక్ అన్నీ ఓ ఊపు ఊపేస్తుండడంతో మెగాస్టార్ సినిమాకి మామూలుగా ఉండే అంచనాలకన్నా కూడా ‘ఆచార్య’పై మరింత భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పైగా ఇందులో రామ్ చరణ్, చిరంజీవి తెరపంచుకోనుండటం మెగా అభిమానుల ఆతృతకు అసలు కారణమైంది.

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

- Advertisement -

Tags:Chiranjeevi sets up again

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page