రఘురామ టీడీపీఏజెంట్

0 4

విజయవాడ ముచ్చట్లు:

 

పోలవరంలో నిధులు దోచుకుంటున్నారంటూ సొంత పార్టీ ఎంపీ రఘురామ ఏకంగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రికి ఫిర్యాదు చేయడం ఏపీ రాజకీయాల్లో హీట్ రాజేస్తోంది. రఘురామ ఫిర్యాదు వ్యవహారంపై ఏపీ జలవనరుల మంత్రిఅనిల్ కుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎంపీ రఘురామ టీడీపీ ఏజెంట్‌గా మారిపోయారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే దివంగత నేత వైఎస్సార్, సీఎం వైఎస్ జగన్‌కి మంచి పేరు వస్తుందన్న ఉద్దేశంతోనే రఘురామ లాంటి వాళ్లను అడ్డుపెట్టుకుని టీడీపీ ఇబ్బంది పెట్టాలని చూస్తోందని ఆయన ధ్వజమెత్తారు.రాష్ట్రంలో అమూల్ డెయిరీ పాల సేకరణపై టీడీపీ నేత నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా స్పందించారు అనిల్ కుమార్ యాదవ్. తన తాత సీఎం, నాన్న సీఎం అని చెప్పుకున్నా ఎమ్మెల్యేగా గెలవలేకపోయాడు. ఆ ఎమ్మెల్సీ పదవీ కాలం కూడా ఒక్క సంవత్సరమే ఉండడంతో చినబాబు ఫ్రస్ట్రేషన్ పీక్స్‌కి చేరిందని మంత్రి ఎద్దేవా చేశారు. మూడుశాఖలకు మంత్రిగా పనిచేసిన లోకేష్.. ఎన్నికల్లో ఓడిపోయారన్నారు. సీఎం వైఎస్ జగన్‌ గురించి మాట్లాడే అర్హత నీకు ఉందా అని ప్రశ్నించారు. జగన్‌ను అమూల్ బేబీ అంటున్నావ్.. నువ్వు హెరిటేజ్ దున్నపోతువా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మాటలు మీకే కాదు.. మాకూ వచ్చు అంటూ ఘాటు సమాధానమిచ్చారు.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

 

Tags: Raghurama TDPAgent

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page