వరంగల్ జిల్లాలో క్షుద్రపూజల కలకలం

0 25

వరంగల్ ముచ్చట్లు:

 

వరంగల్ జిల్లాలో చేతబడి కలకలం రేపింది. ఓ వ్యక్తి అకస్మాత్తుగా అదృశ్యం అవ్వడంతో అక్కడ కొందరు చేతబడి చేశారంటూ అనుమానాలు రేకెత్తిస్తున్నారు. జిల్లాలోని చెన్నారావుపేట మండలంలో గల ఉప్పరపల్లి గ్రామంలో ఈ చేతబడుల వ్యవహారం స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. రాత్రికి రాత్రే ఓ యువకుడు మాయమయ్యాడు. అయితే గతంలో ఇదే తరహాలో ఒకరు అదృశ్యం అయ్యారు. ఇంతవరకు అదృశ్యం అయిన వ్యక్తి ఆచూకీ లభించలేదు.గ్రామంలో రాత్రికి రాత్రే చీమల సతీష్ (28) అనే వ్యక్తి కనిపించకుండా పోయాడు. రాత్రి పడుకున్న సతీష్ తెల్లారేసరికి మాయమయ్యాడు. అయితే అతడు పడుకున్న మంచం పక్కకు చేతబడి చేసిన ఆనవాళ్లు గ్రామస్థులకు కనిపించాయి. సతీష్ పడుకున్న మంచం పక్కన మనిషి బొమ్మ, ముగ్గు గీశారు. అందులో పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, మిరపకాయలు. బొగ్గు వేసి ఉంది. దీంతో సతీశ్ పై చేతబడి జరిగిందా ?అని గ్రామస్థులు అనుమానిస్తున్నారుమరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. గతంలో కూడా ఇదే తరహాలో ఒక వ్యక్తి అదృశ్యం అయ్యాడని, అయితే ఇప్పటివరకు అతని ఆచూకీ లభించలేదని గ్రామస్తులు తెలిపారు. ఈ సంఘటనతో గ్రామ ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

Tags: Kshudrapuzha worship in Warangal district

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page