వారం రోజులుగా చెట్టుకు వేళాడుతున్న శవాలు

0 32

నిజామాబాద్ ముచ్చట్లు:

 

నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. అడవి ప్రాంతంలో ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. గత వారం రోజుల నుండి చెట్టుకు ఆ రెండు మృతదేహాలు వేలాడుతూనే ఉన్నాయి. వాటిని ఎవరూ గమనించలేదు. ఈరోజు స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. నిజామాబాద్ జిల్లాలోని చండూరు మండలం లక్ష్మీపురం లో ఉన్న అడవి ప్రాంతంలో ఓ ప్రేమ జంట చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మోస్రామ్ మండలంలోని తిమ్మాపూర్ కి చెందిన మోహన్, లక్ష్మి గా పోలీసులు గుర్తించారు‌. అయితే వీరు గత వారం రోజుల క్రితమే ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

 

Tags: Corpses hanging from a tree for days a week

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page