వారుసుడి ఎంట్రీ

0 37

శ్రీకాకుళం   ముచ్చట్లు:

వ‌చ్చే 2024 ఎన్నిక‌ల్లో గ‌తంలో ఎక్కువ మంది నేత‌లు త‌మ త‌మ వార‌సుల‌ను రంగంలోకి తీసుకువ‌చ్చేందు కు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇటు టీడీపీలోను, అటు.. వైసీపీలోను కీల‌క నేత‌లు అంద‌రూ వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ వార‌సుల‌ను రాజ‌కీయాల్లోకి తీసుకువ‌చ్చేందుకు ప్రయ‌త్నిస్తున్నారు. ఇలాంటి వారిలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం, మంత్రి ధ‌ర్మాన కృష్ణదాస్ ముందువ‌రుస‌లో ఉన్నారు. న‌ర‌స‌న్నపేట నియోజ‌క వ‌ర్గం నుంచి గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌పున విజ‌యం ద‌క్కించుకున్నారు ధ‌ర్మాన కృష్ణదాస్.వాస్తవానికి న‌ర‌స‌న్నపేట నియోజ‌క‌వ‌ర్గంపై ధ‌ర్మాన కృష్ణదాస్ కు మంచి ప‌ట్టుంది. గ‌తంలో కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున ఇక్కడ అనేక‌సార్లు విజ‌యం సాధించారు. 2004, 2009 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ టికెట్‌పై విజ‌యం సాధించారు. దివంగత వైఎస్ కు స‌న్నిహితుడుగా పేరు తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ స్థాప‌న‌తో జిల్లా నుంచి వైసీపీలోకి వెళ్లిన తొలినాయ‌కుడిగా కూడా కృష్ణదాస్ గుర్తింపు సాధించారు. కృష్ణదాస్ భార్య ప‌ద్మప్రియ జిల్లా పార్టీ అధ్యక్షురాలిగా కూడా ప‌నిచేశారు. ఈ క్రమంలోనే 2012లో వ‌చ్చిన ఉప ఎన్నిక‌లో వైసీపీ త‌ర‌ఫున విజ‌యం సాధించారు. ఇక‌, 2014లో మాత్రం ఆయ‌న వైసీపీ త‌ర‌ఫున పోటీ చేసినా.. ఓడిపోయారు.కానీ, ప‌ట్టుబ‌ట్టి.. 2019లో దాస్ ఇక్కడ విజ‌యం ద‌క్కించుకోవ‌డంతోపాటు.. జ‌గ‌న్ మంత్రివ‌ర్గంలోనూ చోటు సంపాదించుకున్నారు. కొన్నాళ్ల కింద‌ట‌.. ఆయ‌న‌ను డిప్యూటీ సీఎంగా కూడా ప్రమోట్ చేశారు ముఖ్యమంత్రి. జ‌గ‌న్ ధ‌ర్మాన కృష్ణదాస్ ను ఎంత‌లా న‌మ్మారంటే సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి అయిన ధ‌ర్మాన ప్రసాద‌రావును కాద‌ని మ‌రీ కృష్ణదాస్‌కు మంత్రి ప‌ద‌వి ఇచ్చారు.

 

 

- Advertisement -

అయితే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను పోటీకి దూరంగా ఉంటున్నట్టు కొన్నాళ్ల కింద‌ట‌.. కృష్ణదాస్ ప్రక‌టించా రు. ఈ క్రమంలో త‌న వార‌సుడు.. ధ‌ర్మాన కృష్ణచైత‌న్య‌ను వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌ఫున పోటీకి నిల‌బెట్టాల ని భావిస్తున్నారు. దీనికి సంబంధించి.. సీఎం జ‌గ‌న్‌.. కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది.ఇక‌, కృష్ణ చైత‌న్య విష‌యానికి వ‌స్తే.. కొన్నాళ్లుగా నియోజ‌క‌వ‌ర్గంలోనే కాకుండా.. జిల్లా రాజ‌కీయాల్లోనూ ఆయ‌న దూకుడుగా వ్యవ‌హ‌రిస్తున్నారు. ముఖ్యంగా టీడీపీపై సంచ‌ల‌న కామెంట్లు కూడా చేస్తున్నారు. గెలిచిన నేత‌లు మాత్రమే అభివృద్ధి చేస్తార‌ని.. ఓడిపోయిన నేత‌లను ఎవరూ ప‌ట్టించుకోరు.. అంటూ.. చుర‌క‌లు అంటిస్తున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో అధికారుల బ‌దిలీలు, ఇత‌ర వ్య‌వ‌హారాలు, కాంట్రాక్టులు అన్ని ఆయ‌న క‌నుస‌న్నల్లోనే న‌డుస్తున్నాయ‌న్న టాక్ వ‌చ్చేసింది. ఇక‌, పార్టీ కార్క్ర‌మాల్లోనూ ఇటీవ‌ల కాలంలో కృష్ణ చైత‌న్యే పాల్గొంటున్నారు. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనే ధ‌ర్మాన కృష్ణదాస్ వార‌స‌త్వాన్ని కృష్ణ చైత‌న్య కొన‌సాగించే ఛాన్సులే ఎక్కువ ఉన్నాయంటున్నారు ప‌రిశీల‌కులు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags:Succession entry

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page