విరామమెరుగని నవ చైతన్య సేవలు భేష్

0 3

ఖమ్మం ముచ్చట్లు:

 

గడచిన రెండేళ్లుగా సత్తుపల్లి పరిసర ప్రాంత ప్రజలకు నవచైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ విరామమెరుగక కుండా అందిస్తున్న సేవలు భేష్ అంటూ ఎంపిపి దొడ్డ హైమావతి శంకర్రావు, ఎం.పి.డి.ఓ సుభాషిణి లు ప్రశంసించారు. గురువారం మండల పరిధిలోని కాకర్లపల్లి ఐసొలేషన్ సెంటర్ లో పౌష్టికాహారం ను వారు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అనే నానుడికి సరిపోయేలా సేవలందించడం ప్రతిరోజు గమనిస్తున్నామన్నారు. ఇటువంటి సంస్థ చేపడుతున్న కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ సేవా భావంతో భాగస్వాములు కావాలని సూచించారు. హోమ్ ఐసొలేషన్ లో ఉన్న నిరుపేదలకు నిత్యావసరాలు అందిస్తుండడం గొప్ప విషయమన్నారు. ఈ సందర్భంగా పట్టణానికి చెందిన సాయిశ్రీ మినీ మార్ట్ యజమానీ గన్నవరపు చరణ్ రూ.1200విలువ గల బియ్యం అందజేసినట్లు సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు గాదె నరసింహారెడ్డి, తోట కిరణ్ లు తెలిపారు. కాకర్లపల్లి ఐసొలేషన్ సెంటర్ కు 2 పూటల పౌష్టిక ఆహారం అందజేయడం తో పాటు పట్టణం లో 12కుటుంబాలకు బియ్యం, కూరగాయలు, నిత్యావసర సరుకుల,పండ్లు, గుడ్లు అందజేసినట్లు తెలిపారు. సంస్థ కార్యక్రమాల్లో భాగస్వాములు అవ్వదలచిన వారు, సేవలు పొందదలచిన వారు 8897777223, 9703703708 నంబర్ లలో సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు మాదిరాజు పుల్లారావు, మోరంపుడి జగదీష్, రాగం శ్రీను, మైలమాల యేసయ్య, సయ్యద్ ముస్తఫా, పాలకొల్లు కార్తీక్, పాలకొల్లు శ్రీనివాసరావు, కోట శివనాగరాజు, మారయ్య తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

 

Tags: Bhesh non-stop rejuvenation services

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page