సంవ‌త్స‌రం పూర్తి చేసుకున్న సుంద‌ర‌కాండ పారాయ‌ణం

0 11

విశ్వవ్యాప్తంగా భ‌క్తుల నుండి విశేష స్పంద‌న‌

తిరుమల ముచ్చట్లు:
విశ్వంలోని స‌క‌‌ల జీవ‌రాశులు ఆయురారోగ్యా‌ల‌తో ఉండాల‌ని శ్రీ‌వారిని ప్రార్థిస్తూ తిరుమ‌ల‌ నాద‌నీరాజ‌నం వేదిక‌పై టిటిడి నిర్వ‌హిస్తున్న సుంద‌ర‌కాండ‌ పారాయణం విజయవంతంగా ఒక సంవత్సరం పూర్తి చేసింది. విశ్వ‌వ్యాప్తంగా ఉన్న శ్రీ‌వారి భ‌క్తుల నుండి ఈ కార్య‌క్ర‌మానికి విశేష స్పంద‌న ల‌భిస్తోంది. ఈ సంద‌ర్బంగా ధర్మగిరి వేద పాఠ‌శాల‌ ప్రిన్సిపాల్ శ్రీ కెఎస్ఎస్ అవధాని మాట్లాడుతూ కోవిడ్ – 19 వ్యాధిని అరికట్టాలని, లోక క‌ల్యాణార్థం టిటిడి నిర్వ‌హిస్తున్న మ‌హామంత్ర పారాయణ యజ్ఞంలో భాగంగా, సుద‌ర‌కాండ పారాయణం ప్రారంభించి నేటికి సంవ‌త్స‌ర‌ము పూర్తి కాగా, మంత్ర  పారాయ‌ణం 427 రోజులు పూర్తి చేసుకుంద‌న్నారు. వాల్మీకి మ‌హ‌ర్షి ర‌చించిన రామాయ‌ణంలోని సుంద‌ర‌కాండ పారాయ‌ణం వ‌ల‌న బుద్ధి, బ‌లం, ధైర్యం కలిగి స‌కల జీవులు ఆయురారోగ్యాల‌తో ఉంటాయని తెలిపారు. ఒక గొప్ప ఉద్దేశ్యంతో చేపట్టిన మ‌హామంత్ర పారాయ‌ణం వ‌ల‌న ఖచ్చితంగా మంచి  ఫలితాలు ఇస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయ‌న్నారు.   ఇందులో భాగంగా గ‌త ఏడాది మార్చి 16 నుండి 25వ తేదీ వ‌ర‌కు శ్రీ‌నివాస వేద‌మంత్ర ఆరోగ్య జ‌పయ‌జ్ఞం, మార్చి 26 నుండి 28వ తేదీ వ‌ర‌కు శ్రీ శ్రీనివాస శాంత్యోత్సవ సహిత ధన్వంతరి మహాయాగం నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. అనంత‌రం నాద‌నీరాజ‌నం వేదిక‌పై “యోగ‌వాశిస్టం – శ్రీ ధ‌న్వంత‌రి మ‌హామంత్రం” పారాయ‌ణాన్ని గ‌త ఏడాది ఏప్రిల్ 10 నుండి జూన్ 10వ తేదీ వ‌ర‌కు 62 రోజుల పాటు నిర్వహించారు. ఆ తరువాత జూన్ 11వ తేదీ ప్రారంభ‌మైన సుంద‌ర‌కాండ పారాయ‌ణం జూన్ 10వ తేదీకి 365 రోజులు పూర్త‌యింది. ఇప్ప‌టి వ‌ర‌కు టిటిడి 14వ‌ విడ‌త‌లుగా సుంద‌ర‌కాండ అఖండ పారాయ‌ణం, సెప్టెంబ‌రు 29 నుండి అక్టోబ‌రు 14వ తేదీ వ‌ర‌కు షోడ‌శ‌దిన సుంద‌ర‌కాండ దీక్ష కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించింది. జూలై 15న విరాట‌ప‌ర్వం – లోక క‌ల్యాణ పారాయ‌ణం, సెప్టెంబ‌రు 10వ తేదీ నుండి గీతా పారాయ‌ణం నిర్వ‌హిస్తున్నారు.అదేవిధంగా ఈ ఏడాది మే 3 నుండి 18వ తేదీ వ‌ర‌కు షోడ‌శ‌దిన సుంద‌ర‌కాండ దీక్ష, మే 9వ తేదీ నుండి నక్షత్రసత్ర మహాయాగం నిర్వ‌హిస్తున్న‌ది. అదేవిధంగా మే 31న 16 గంట‌ల పాటు ఏక దిన అఖండ‌ సుద‌ర‌కాండ పారాయ‌ణం జ‌రిగింది. జూన్ 11నుండి జూలై 30వ తేదీ వ‌ర‌కు యుద్ధ‌కాండ పారాయ‌ణం నిర్వ‌హించ‌నున్నారు.

- Advertisement -

తిరుమ‌ల‌ ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్ శ్రీ కుప్పా శివ‌సుబ్ర‌మ‌ణ్య అవధాని, ఎస్వీ ఉన్న‌త వేదాధ్యయ‌న‌ సంస్థ ప్రాజెక్టు అధికారి శ్రీ విభీష‌ణ శ‌ర్మ ఉద‌యం 7.00 నుండి 8.00 గంట‌ల వ‌ర‌కు సుంద‌ర‌కాండను పారాయ‌ణం చేస్తున్నారు. ఈ ప‌రాయ‌ణ కార్య‌క్ర‌మంలో పండితులు శ్లోకాల‌ను భ‌క్తుల‌తో ప‌లికించి అర్థ‌ తాత్ప‌ర్యాల‌తో పాటు ఆ శ్లోక ఉచ్చ‌‌‌ర‌ణ వ‌ల‌న క‌లిగే ఫ‌లితం, నేటి ఆధునిక స‌మాజంలోని మాన‌వాళికి ఏవిధ‌‌మైన సందేశం ఇస్తుందో వివ‌రిస్తూ నిరంత‌రాయంగా పారాయ‌ణ కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తున్నారు. ఎస్వీబీసీలో ఈ పారాయ‌ణ కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల‌తోపాటు దేశ విదేశాల్లోని భ‌క్తులు పెద్ద‌సంఖ్య‌లో అనుస‌రించి త‌మ ఇళ్లలో పారాయ‌ణం చేస్తున్నారు.

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

Tags:Sunderkanda recitation completed the year

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page