సాల్వ్‌ కు సిఇఓగా అమిత్ భన్సాల్ నియామకం

0 2

హైదరాబాద్ ముచ్చట్లు :

 

సాల్వ్, ఎంఎస్ఎంఇల కోసం ఒక జీరో ఇన్వెంటరీ పూర్తి కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ బి2బి వాణిజ్య మార్కెట్ ప్లేస్, ఈ రోజు తమ సిఇఓగా, బోర్డ్ సభ్యునిగా అమిత్ భన్సాల్‌ను నియమిస్తున్నట్టు ప్రకటించింది. భారతదేశంలో 65 మిలియన్ల పైచిలుకు ఎంఎస్ఎంఇలకు జీవనోపాధి అవకాశాలను సృష్టించాలన్న తన మౌలిక లక్ష్యాన్ని సాధించడానికి స్టార్టప్ ను దాని వాణిజ్య, రుణ, సౌకర్య సేవల ద్వారా కంపెనీకి సంబంధించిన వ్యూహాత్మక దిశలో అమిత్ నడిపిస్తారు.అమిత్ అనుభవం ఉన్న నాయకుడు, ప్రపంచవ్యాప్తంగా ఇ-కామర్స్, రిటైల్ వ్యాపారాలలో రెండు దశాబ్దాలపాటు వివిధ పాత్రల్లో ఆయన పని చేశారు. ఇ-కామర్స్ రంగంలో లోతైన పరిజ్ఞానం కలిగిఉండడంతో పాటు ఉత్పత్తి అభివృద్ధి, సరఫరాల గొలుసుకట్టు, ఫిన్‌టెక్‌ల వ్యాప్తంగా బహుళ విభాగాల్లో అనుభవాన్ని ఆయన సంపాదించుకున్నారు.

 

 

 

- Advertisement -

ఇంతకుముందు ఆయన నాయకత్వం వహించిన రిలయన్స్ రిటైల్, ఫ్లిప్‌కార్ట్ తదిరత సంస్థలలో తన అనుభవానికి పదును పెట్టుకున్నారు. సాల్వ్ లో చేరడానికి ముందు వీడియో కామర్స్ రంగంలో మార్గదర్శి అయిన ఇజెడ్‌మాల్.కామ్ వ్యవస్థాపక సిఇఓగా అమిత్ ఉన్నారు. క్షేత్రస్థాయి నించి ఇజెడ్‌మాల్ మౌలిక సదుపాయాల నిర్మాణానికీ, అలాగే అనేక కీలకమైన సరఫరా గొలుసుకట్టు భాగస్వాములతో భాగస్వామ్యాన్ని నిర్మించడానికి ఆయన దోహదకారి అయ్యారు. ఈ నియామకంపై, జితిన్ అరోరా, వెంచర్ లీడ్, సాల్వ్, మరియు సభ్యుడు, ఎస్‌సి వెంచర్స్, మాట్లాడుతూ “అంతర్జాతీయ రిటైల్ మార్కెట్‌లో, భారతీయ ఇ-కామర్స్ & మర్చెంట్ ఎకోసిస్టమ్ రంగంలో అపారమైన అనుభవం కలిగిన అమిత్ ఈ పాత్రకు సహజంగానే సరిపడే వ్యక్తి అని పేర్కొన్నారు.

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

 

Tags: Amit Bhansal appointed CEO of Solve

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page