సీఎం పర్యటనపై రాజకీయాలు తగదు

0 23

విశాఖపట్నం   ముచ్చట్లు:
సీఎం ఢిల్లీ పర్యటనపై రాజకీయం తగదని మంత్రి బొత్ప వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి నిధుల కోసమే జగన్ ఢిల్లీ వెళ్లారని మంత్రి స్పష్టం చేశారు.విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్షాలు సలహాలు ఇవ్వకుండా.. విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు.గత ప్రభుత్వం కంటే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు జగన్ సర్కార్ అమలు చేస్తోందన్నారు. విపత్కర పరిస్థితుల్లోనూ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని మంత్రి చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో పండిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని బొత్స తెలిపారు. వ్యాక్సిన్పై విమర్శలు చేయడం సరికాదన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారని మంత్రి వ్యాఖ్యానించారు.

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

- Advertisement -

Tags:The politics on the CM’s visit are inappropriate

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page