అధైర్య పడకండి… అండగా ఉంటాం – కోవిడ్ బాధితులకు సర్పంచ్ భరోసా

0 125

రామసముద్రం ముచ్చట్లు:

 

కరోన భారిన పడిన వారు అధైర్య చెందాల్సిన పనిలేదని కెసిపల్లి సర్పంచ్ దిగువపల్లి శ్రీనివాసులురెడ్డి భరోసా ఇచ్చారు. శుక్రవారం పంచాయతీ పరిధిలోని గుంతయంబాడి గ్రామంలో ఓ వ్యక్తికి కరోన పాజిటివ్ రావడంతో కొంతమందికి కరోన నిర్దారణ పరీక్షలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోన పాజిటివ్ వచ్చిన వారెవరు అధైర్య చెందాల్సిన అవసరం లేదని, వారికి ప్రభుత్వం అండగా ఉందన్నారు. రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, మదనపల్లి యువ శాసనసభ్యులు నవాజ్ బాషాలు మండలంలో నమోదైన కరోన కేసుల వివరాలు తెలుసుకుంటూ సకాలంలో చికిత్సలు అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారన్నారు. ఎమ్మెల్యే నవాజ్ బాషా ఆదేశాల మేరకు ముందస్తుగా కరోన పరీక్షలు నిర్వహించి పాజిటివ్ వచ్చిన వారికి మెరుగైన వైద్య చికిత్సలు అందిస్తూ కరోన నివారణకు అధికారులు ఎనలేని కృషి చేస్తున్నారన్నారు. కరోన సోకిన వారు జాగ్రత్తలు పాటిస్తూ అధికారులు ఇచ్చిన మందులు వేసుకుంటే త్వరగా తగ్గుముఖం పడుతుందన్నారు. ప్రజలు కూడా అనవసరంగా బయట సంచరించకుండా మాస్కులు ధరించి భౌతిక దూరాన్ని పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి, ఏఎన్ఏం సుగుణమ్మ, ఆశ వర్కర్లు మంజుల, రాధమ్మ, నాయకులు బాబు, ఎల్లారెడ్డి, వెంకటరమణ రెడ్డి, చంద్రశేఖర్ రావు, విటి.జయచంద్ర, ఎల్.మునస్వామి, ఎన్.వెంకటరమణ, కె.శివశంకర్, పి.నాగరాజ, వాలింటర్లు దినకర్, కుమారస్వామి, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

 

Tags: Do not be discouraged … we will stand firm – Sarpanch assures Kovid victims

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page