అమ్మమ్మ స్మతిలో రోగులకు అన్నదానం

0 10

జగిత్యాల ముచ్చట్లు:

తిరిగిరాని లోకాలకు తరిలిపోయిన ఆమ్మమ్మ సృతిలో మనుమలు, మనుమరాళ్ళు వంద
మంది రోగులకు అన్నదానం చేసి తమ ఆత్మీయతను చాటుకొన్న యధార్థమిది. అనురాగాలు, ఆప్యాయతలకు మారుపేరుగా నిలిచిన తమ అమ్మమ్మ కి.శే. దండె లక్ష్మి జ్ఞాపకార్థం ఎంత చేసినా తక్కువే అన్న భావనతో ఉన్న మనుమలు, మనుమరాళ్లు వృద్ధాశ్రమములో అందించిన చేయుతకు తోడు శుక్రవారం జగిత్యాల జిల్లా ప్రధాన అసుపత్రిలోని రోగులకు, అటెండెంట్స్ వంద మందికి భోజన సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. ఆ సందర్భంగా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ కరోన కష్టకాలంలో ఎందరో తమకు తోచిన సహాయాన్ని నిరుపేదలకు అందిస్తారని అయితే అదే కోవలో తమ అమ్మమ్మ దండె లక్ష్మి జ్ఞాపకార్థం జిల్లా అసుపత్రిలోని రోగులకు భోజన సదుపాయాన్నిఏర్పాటు చేశామని ఈ సేవలో ఎంతో అనందాన్ని కల్గించిందన్నారు. ఈ కార్యక్రమములో అసుపత్రి సూపరిండెంట్
సుదక్షిణాదేవి, అర్ఎంవో రామకృష్ణతోపాటు నెళ్ల రాజేశ్వర్ రెడ్డితో పాటు కుటుంబ సభ్యులు ఉన్నారు.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

Tags: Donation to patients in Grandmother Smith

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page