అమ్మో…ఎలుగుబంటి

0 55

శ్రీకాకుళం ముచ్చట్లు:
ఎలుగుబంటిని చూస్తే   ఉద్దానం ప్రజలు ఠారెత్తిపోతున్నారు. మనుషులను చూసి భయపడి పరుగులు తీసే భల్లూకం దాడి చేసే పరిస్థితికి రావడంతో తీరప్రాంతం, ఉద్దానం పల్లెలు వణికిపోతున్నాయి. వేసవిలో జీడితోటల నేపథ్యంలో మందస, సోంపేట, వజ్రపుకొత్తూరు మండలాల పరిధిలో ఎలుగుబంట్లు  సంచరిస్తుంటాయి. ఇప్పటివరకు మనుషులను గాయపర్చడం తప్ప, చంపిన సందర్భాలు తక్కువ. ఇటీవల మాత్రం మనిషి కనిపిస్తే చాలు.. దాడి చేసే పరిస్థితి ఉండడంతో జీడితోటలపై ఆధారపడి బతుకుతున్నవారంతా ఆందోళన చెందుతున్నారు. . మార్చి మొదలు జూన్‌ చివరివరకు జీడి తోటల్లో దిగుబడులు వస్తుంటాయి. ఉద్దానం అంతటా జీడితోటల మధ్యలో గ్రామాలు ఉన్నాయి. ఈ నాలుగు నెలల్లో ఉద్దానంలో జీడిపండు సువాసనను పసిగట్టి ఎలుగుబంట్లు తోటల్లోకి ప్రవేశించి క్షుద్భాద తీర్చుకుంటాయి. రాత్రంతా తోటలు, నివాసిత ప్రాంతాల పరిధిలో తిరుగుతూ పగలు నిద్రావస్థలో ఉంటాయి.

వాతావరణంలో నెలకొన్న మార్పులు, ఉద్దానం తోటల్లో నీటికొరత నేపథ్యంలో రాత్రిపూట ఇళ్లల్లోకి ప్రవేశిస్తుంటాయి. ఇప్పటివరకు ఇళ్లల్లో ప్రవేశించినా నూనె, ఇతర వస్తువులు తిని వెళ్లడం తప్ప మనుషులకు ఎలాంటి హాని కలిగించే పరిస్థితి లేదు. ఎలుగుబంట్లు ఆత్మరక్షణ కోసమే దాడికి పాల్పడుతుంటాయి. వాటిని కవ్వించకపోతే ఎలాంటి ఇబ్బందులకు గురిచేయవు. కొన్ని ప్రత్యేక పరిస్థితులు, మతిస్థిమితం తప్పిన పరిస్థితుల్లో మాత్రమే వ్యక్తులపై దాడులకు పాల్పడతాయి. ఎర్రముక్కాం సంఘటనలో ఎలుగుబంటికి రేబిస్‌ వ్యాధి సోకడంతో మతిస్థిమితం తప్పి బీభత్సం సృష్టించిన పరిస్థితి కనిపిస్తుంది.  ఇప్పటికీ పలుమార్లు రైతులకు తారసపడినా ఎవరినీ ఏమీ చేయని జంతువు ఒక్కసారి విరుచుకుపడడానికి మతిస్థిమితం లేకనే ఇలా జరిగి ఉంటుంది. తోటల్లో నక్కలు కరిస్తే ఇలాంటి పరిస్థితి తలెత్తుతుంది. ఉద్దానం తోటల్లోని ఎలుగుబంట్లను జంతు ప్రదర్శనశాలకు తరలించాల్సి ఉంది.ఈ ఏడాది మాత్రం మనిషి కనిపిస్తే దాడికి దిగే పరిస్థితి నెలకొనడంతో ఉద్దానం పల్లెల్లోని ప్రజలు వణుకుతున్నాయి.ఎలుగుబంటి బీభత్సం సృష్టించే పరిస్థితికి చేరుకోవడం వెనుక కారణాలపై పశువైద్యనిపుణులు సైతం విస్మయం వ్యక్తంచేస్తున్నారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప, ఎలుగుబంటి వ్యక్తులను బలి తీసుకొనే పరిస్థితి ఉండదని వారు స్పష్టం చేస్తున్నారు.ఎలుగుబంట్లు ఆహారం, నీరు దొరకనందునే ఉద్దానం జీడి తోటలకు వలస వస్తున్నాయి. జాతీయ రహదారికి పడమర వైపున మహేంద్రగిరులు, తూర్పువైపున ఉద్దాన ప్రాంతం ఉండడంతో వన్యమృగాల సంచారం ఇరువైపులా ఉంటుంది. ముఖ్యంగా వేసవిలో మహేంద్రగిరుల పరిధిలో నీటి వనరులు అడుగంటిపోవడం, ఆహారం కొరత ఏర్పడడంతో ఉద్దాన ప్రాంతానికి ఎలుగుబంట్లు చేరుతాయి. ఉద్దానంలో 1.25 లక్షల ఎకరాలలో జీడి, మామిడి, ఇతర ఉద్యానతోటలు సాగవుతున్నాయివరుసగా సంభవిస్తున్న సంఘటనల నేపథ్యంలో రైతులు జీడితోటలకు వెళ్లాలంటే ఆందోళన చెందుతున్నారు. జీడిపండ్లను తినేందుకే ఎలుగుబంట్లు ఉద్దానం తోటలకు వలసలు వచ్చి స్థిరపడిపోయాయి. మందస మండలం రట్టి, బహడపల్లి పరిధిలోని  కొండ ప్రాంతం వీటికి ఆవాసంగా మారడంతో ఏడాది పొడవునా ఉద్దానంలోనే ఇవి ఉంటున్నాయి. అటవీశాఖ అధికారుల అంచనా మేరకు ఉద్దానంలో 60 ఎలుగుబంట్లు సంచరిస్తున్నాయి. ఎర్రముక్కాంలో జరిగిన సంఘటనతో ఉద్దానం అంతా ఉలిక్కిపడింది. ఏడాదిలో నాలుగు నెలల పాటు తోటల్లోనే జీవనం సాగించే ఉద్దానం ప్రజలను ఈ బీభత్సం ఆందోళనకు గురిచేస్తుంది.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

Tags:Um … bear

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page