ఆయాలకు అందని జీతాలు

0 8

నెల్లూరు ముచ్చట్లు:
ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న శానిటేషన్‌ సిబ్బంది (ఆయా)కి ఏడాదికి పైగా వేతనాలు అందడం లేదు. ఇతర పనులు కూడా లేకపోవడంతో కరోనా సమయంలో ఆయాలు ఆర్థికంగా పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠశాలల మరుగుదొడ్ల నిర్వహణ నిధుల పేరుతో అమ్మఒడి లబ్ధిదారుల నుంచి రూ.1000 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం పథకం విడుదల చేసిన రోజే మినహాయించుకుంది. మరుగుదొడ్ల నిర్వహణ కోసం జాయింట్‌ బ్యాంకు ఖాతాలను కూడా పాఠశాలలతో పాఠశాల విద్యాశాఖ తెరిపించింది. ఈ ఖాతాలో నగదు జమ చేస్తామని విద్యాశాఖ వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా 45 వేల ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. విద్యార్థుల సంఖ్య 300లోపు ఉన్న పాఠశాల ఒక ఆయాను, 301ా600లోపు ఉంటే ఇద్దరిని, 600ా900లోపు ఉంటే ముగ్గురిని, 1200లోపు ఉంటే నలుగురు చొప్పున ఆయాలను నియమించుకోవాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 40 వేల మంది ఆయాలు పాఠశాలల్లో పనిచేస్తున్నారు. గౌరవ భృతి పేరుతో వీరికి రూ.6 వేలు చొప్పున 10 నెలలు, రూ.3 వేలు చొప్పున 2 నెలలు వేతనాలు చెల్లించాలని విద్యాశాఖ నిర్ణయించింది.

 

అమ్మఒడి పథకం లబ్ధిదారుల ఖాతాల నుంచి జనవరి 9నే రూ.1000 మినహాయించుకున్నా నగదు ఇప్పటి వరకు మరుగుదొడ్ల నిర్వహణ ఖాతాల్లో జమ కాలేదు. గతేడాది జులై నుంచి వీరికి వేతనాలు అందని దుస్థితి నెలకొంది. నెలల తరబడి ఆగిపోవడంతో కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులే ఆయాలకు ఆర్థికంగా సహాయం చేస్తున్నారు. ఆయాలకు వేతనాలు విడుదల చేయాలని ఉపాధ్యాయ సంఘాలు విద్యాశాఖ దృష్టికి తీసుకెళ్లినా అధికారులు ఇంతవరకు స్పందించలేదు. విద్యార్థుల నుంచి మినహాయించిన నగదునే ఆయాలకు ఇవ్వడానికి ఇబ్బంది ఏమిటని ఉపాధ్యాయ సంఘాలు విద్యాశాఖను ప్రశ్నిస్తున్నాయి. 2020 జులై నుంచి వీరికి గౌరవ భృతి చెల్లించలేదని ఎపి ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు జివి నారాయణ రెడ్డి తెలిపారు. కరోనా కష్టకాలంలో ఆయాలకు వెంటనే గౌరవ భృతి చెల్లింపులు జరిపేందుకు తగు చర్యలు తీసుకోవాలని కోరారు.ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న వాచ్‌మెన్లకు కూడా వేతనాలు అందక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. వీరికి కూడా నెలకు రూ.3,500 చొప్పున విద్యాశాఖ చెల్లించాల్సి ఉంది. సుమారు ఏడాది నుంచి వీరికి వేతనాలు అందడం లేదు.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

Tags:Beautiful salaries for nurses

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page