ఆస్తి పన్ను పెంపు వద్దు

0 15

విశాఖపట్నంముచ్చట్లు:

 

ఆస్తి పన్ను పెంపు నిర్ణయాన్ని ఉపసం హరించుకోవాలని డిమాండ్ చేస్తూ విశాఖలో పలు రాజకీయ పార్టీల నేత లు నిరసన వ్యక్తం చేశారు.ఆస్తి మూల విలువ ఆధారంగా ఆస్తి పన్నులు విధించాలనే జీవీఎంసీ నిర్ణయాన్ని తక్షణమే రద్దు చేసి పాత పద్దతిలో ఇంటి అద్దె విలువ ప్రాతిపదికన ఆస్తి పన్ను వసూలు చేయాలని డిమాండ్ చేస్తూ విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సీపీఐ సీపీఎం జనసేన లోక్సత్తా సీపీఐ ఎం ఎల్ పార్టీలు పెద్ద ఎత్తున నిరసన నిర్వహించాయి.ఈ సందర్భం గా సీపీఐ నేత పైడి రాజు నాయకులు మాట్లాడుతూ విశాఖ ఎం వి పి కాలనీలో ప్రస్తుతం పదిహేను వందల రూపాయలు ఇంటి పన్ను కడుతున్నారని నూతన విధానం వల్ల పది వేల రూపాయలు కట్టవలసి వస్తుందని, నూతన విధానం వలన విశాఖ నగర ప్రజలపై 600 కోట్ల రూపాయలు భారం పడుతుందని, ప్రజలపై పన్నుల రూపంలో మరిన్ని భారాలు మోపడాన్ని తీవ్రంగా ఖండిస్తూ… తక్షణమే ఇటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఉపసంహరిం చుకోవాలని కోరారు.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

Tags:Do not want a property tax increase

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page