ఈటల ఎఫెక్ట్… హరీశ్ రావుకు ప్రాధాన్యం

0 15

హైదరాబాద్ ముచ్చట్లు:

 

తెలంగాణలో రెండోసారి అధికారంలోకి వచ్చిన కొత్తలో టీఆర్ఎస్ పార్టీ అధిష్ఠానం అత్యంత ప్రజాదరణ కలిగిన హరీశ్ రావును దూరం పెట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జనం నుంచి వ్యతిరేకత ఏర్పడడంతో కొన్నాళ్లకు మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ప్రస్తుతం చూస్తే సీఎం కేసీఆర్ మేనల్లుడు, టీఆర్ఎస్ ట్రబుల్ షూటర్అయిన హరీశ్రావు మళ్లీ యాక్టివ్ అయినట్లుగా కనిపిస్తోంది. ఆ మధ్య ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి ఆయన హవా కొనసాగుతున్నట్లు కనిపించగా.. ఈటల రాజేందర్ ఉద్వాసన ఘటనతో మరింతగా ఫాంలోకి వచ్చినట్లుగా అవగతం అవుతోంది. మూడేళ్లుగా టీఆర్ఎస్‌లో హరీశ్ రావు హడావుడి అంతగా కనిపించలేదు. ఈటల రాజేందర్‌ను తొలగించడంతోనే పార్టీలో, ప్రభుత్వంలోనూ హరీశ్రావుకు ప్రాధాన్యం పెరిగినట్లు కనిపిస్తోంది. అదే సమయంలో కేటీఆర్ ప్రభ కాస్త తగ్గినట్లుగా ఉంది. ఈమధ్య ఖాళీ అయిన ఈటల రాజేందర్ స్థానం అయిన ఆరోగ్యశాఖ సహా కేసీఆర్ కీలకమైన పనులన్నీ కేసీఆర్హరీశ్రావుకే అప్పగిస్తున్నారు.

 

 

- Advertisement -

అప్పట్లో కుమారుడు కేటీఆర్‌కు సీఎం పదవి ఇచ్చేందుకే మేనల్లుడు హరీశ్రావును దూరం పెట్టారనే ప్రచారం సాగింది. కానీ, ఇప్పుడు హరీశ్ రావుకు పార్టీలో ప్రాధాన్యం పెరినట్లు కనిపిస్తుండడం ఆసక్తి కలిగిస్తోంది. పార్టీ సహా ప్రభుత్వ వ్యవహారాల్లోనూ మంత్రి కేటీఆర్‌కు బదులుగా హరీశ్‌ రావుకే కేసీఆర్ప్రాధాన్యం ఇస్తున్నట్లుగా తాజా పరిణామాలను చూస్తే అర్థమవుతోంది. కేబినెట్ సబ్ కమిటీల ఏర్పాటు, కీలకమైన సమావేశాలే కాకుండా.. పార్టీ బలోపేతానికి చేపట్టే ఆపరేషన్లన్నీ హరీశ్‌ రావుకే అప్పగించారు. ప్రగతి భవన్‌లో జరిగే ప్రత్యక్ష సమీక్షల్లో హరీశ్ రావు కనిపిస్తుంటే.. కేటీఆర్ మాత్రం ఎక్కువగా సోషల్ మీడియా ట్వీట్లు, ప్రారంభోత్సవాల్లోనే కనిపిస్తున్నారు. ఈటల రాజేందర్ వ్యవహారంలో కూడా ఆయన ఇంత వరకూ స్పందించలేదు. ఇష్యూలోనూ నో కామెంట్ అంటూ కేటీఆర్ దాటవేయటం గమనార్హం.

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

Tags: Eeta effect … Preference for Harish Rao

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page