కాశ్మీర్‌లో భారీ అగ్ని ప్రమాదం.. మంటలను అదుపులోకి తెచ్చేందుకు రంగం లోకి సైన్యం

0 7

శ్రీనగర్ ముచ్చట్లు:

ఉత్తర కాశ్మీర్‌ బారాముల్లా జిల్లాలోని నూర్‌బాగ్‌లోని ఓ కాలనీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో సుమారు ఇండ్లు మంటల్లో చిక్కుకున్నాయి. ఓ ఇంట్లో ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్‌ లీకేజీ కావడంతో అగ్ని ప్రమాదం జరిగినట్లు సమాచారం. గ్యాస్‌తో మంటలు చెలరేగి మిగతా ఇండ్లకు వ్యాపించాయి. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టారు. వారికి స్థానికులు సైతం సహాయం అందించారు.ఇరుకైన రోడ్లు ఉండడంతో ఫైర్‌ టెండర్లు సంఘటనా స్థలానికి తరలించేందుకు ఇబ్బందులెదురయ్యాయి. మంటలను అదుపులోకి తెచ్చేందుకు సైన్యం రెండు, అగ్నిమాపక శాఖ ఐదు ఫైర్‌ ఇంజన్లను ఘటనా స్థలానికి తరలించాయి. డిప్యూటీ సూపరింటెండెంట్‌, అదనపు సూపరింటెండెంట్‌, స్థానిక స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ సహా పలువురు సీనియర్‌ అధికారులు సంఘటనా స్థలంలోనే ఉండి పరిస్థితిని సమీక్షించారు.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

 

Tags:Massive fire in Kashmir .. Army into the field to control the fire

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page