కేసీఆర్ అహంకారాన్ని అంతమొందిస్తాం బీజేపీ నేత తరుణ్ చుగ్

0 12

షామీర్ పేట్ ముచ్చట్లు:
షామీర్ పేట లోని ఈటల నివాసం లో సమావేశం తరువాత మీడియా తో  భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ తెలంగాణ ఇంచార్జ్  తరుణ్ చుగ్  మాట్లాడారు. ఈ రోజు ఈటల గారితో సమావేశం అయ్యాము.  తెలంగాణలో అహంకారానికి ఆత్మాభిమానానికి మద్య యుద్దం జరుగుతుంది. ఇక్కడ అహంకారికి.. అతని ఆవినీతినికి, కుటుంబపాలనకు వ్యతిరేకంగా ఈటల రాజేందర్ టిఆర్ఎస్ పార్టీలో , సమాజంలో కూడా గొంతు ఎత్తారు. ఆ గొంతును నొక్కి వేశారు. రాజ్యఅహంకారంతో అణగదొక్కుతున్నారు. తెలంగాణ కోసం, తెలంగాణ ప్రగతి కోసం గత ఇరవై సంవత్సరాలుగా ఈటల రాజేందర్ కొట్లాడుతున్నారు. ప్రభత్వం తన విధి మర్చిపోయిందని అన్నారు. కేసీఆర్  ఆయన కుటుంబం కోసం తెలంగాణ వచ్చినట్లుంది. తెలంగాణ రాష్ట్ర లక్ష్యం వెనక్కు పోయింది. ఈటల పోరాటం తెలంగాణ సమాజం కోసం పోరాటం. సమాజంలో అందరూ అనుకుంటున్నది. భారతీయ జనతా పార్టీ  కేసీఆర్ వ్యతిరేకంగా ఏదైతే మాట్లాడుతుందో అదే విషయాన్ని ఆయన పార్టీ లోపల ఉంది మాట్లాడారు. అందుకే బయటికి పంపించారు.  తెలంగాణ వికాసం మేమందరం కోరుకుంటున్నాము.  ఈటల శాసన సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నారు. మాతో కలిసి వస్తున్నారు. మా అందరి లక్ష్యం ఒక్కటే తెలంగాణలో  తానాషా  పాలనను, అతని అహంకారాన్ని అంతమొందించడం.  జన ఆందోళనను కొనసాగడానికి తెలంగాణ లో ఎంత మంది వస్తే వారందర్నీ కలుపుకు పోతాం. తెలగాణ వికాసమే భారతీయ జనతా పార్టీ లక్ష్యం.  జననేత, ఉద్యమకారుడు ఈటలకి భారతీయ జనతా పార్టీ  స్వాగతం పలుకుతుంది.  తెలంగాణ కోసం పని చేసిన ఉద్యమకారుడు ఈ రోజు  కేసీఆర్ ను వదిలి పెట్టి బయటికి వస్తున్నారు. కేసీఆర్  అహంకారం ఒడిపోతుంది కుటుంబయపాలన అంతం అవుతుందని అన్నారు.

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

- Advertisement -

Tags:Let’s put an end to KCR arrogance
BJP leader Tarun Chugh

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page