కౌలు రైతులకు గుర్తింపు కార్డులు జారీ

0 16

తుగ్గలి ముచ్చట్లు:

కౌలు రైతులకు గుర్తింపు కార్డులు చాలా ముఖ్యమని, ఈ గుర్తింపు కార్డు ద్వారా ఇన్సూరెన్స్,రైతు భరోసా,పంట నష్టం లాంటి వివిధ ప్రభుత్వ పథకాలు కౌలు రైతులకు సుభిక్షంగా అందుతాయని గ్రామ వ్యవసాయ సహాయకులు సాయినాథ్ రెడ్డి తెలియజేశారు. కావున ప్రతి కౌలు రైతులు గుర్తింపు కార్డులు పొందాలని గ్రామ వ్యవసాయ సహాయకులు  అన్నారు.ముందుగా భూ యజమాని,కౌలు రైతు సమన్వయంతో ఈ కార్డ్ రెవెన్యూ శాఖ ద్వారా  పొందేందుకు అవకాశం వుందని తెలియచేశారు. గిరిగెట్ల, అమీనబాద్ గ్రామాలలోని కౌలు రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు.పంట సాగు దారు హక్కు పత్రాలు అవగాహన సదస్సు ను పగిడిరాయి మరియు కడమకుంట్ల గ్రామాలల్లో కూడా అధికారులు నిర్వహించారు.ఈ సదస్సులో గ్రామ సర్పంచ్ గౌరవ సలహాదారు మధుబాబు,గ్రామ రెవెన్యూ అధికారి రామలింగప్ప,వ్యవసాయ సహాయకులు సాయి నాథ్ రెడ్డి,గ్రామ పెద్దలు మధు రెడ్డి,రామాంజినేయులు,రైతులు తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

Tags:Issuance of identity cards to tenant farmers

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page