తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ జిల్లా చైర్మన్ గా తాళ్ల పెళ్లి సత్యనారాయణ గౌడ్  

0 13

జగిత్యాల ముచ్చట్లు:

తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ జగిత్యాల జిల్లా చైర్మన్ గా కోరుట్ల పట్టణానికి చెందిన తాళ్లపల్లి సత్యనారాయణ గౌడ్ ను నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేసినట్లు తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర చైర్మన్ కోటూరి మానవతారాయ్ ఒక ప్రకటనలో తెలిపారు .           జగిత్యాల జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు , నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం అంకితభావంతో కృషి చేయాలని సూచించారు .    ఈ సందర్భంగా తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ జగిత్యాల జిల్లా చైర్మన్ గా నియమితులైన తాళ్లపల్లి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి మరియు  విద్యార్థి , నిరుద్యోగులకు మధ్య వారధిగా పనిచేస్తూ జేఏసీ బలోపేతానికి తన వంతు కృషి బాధ్యతతో చేస్తానని తెలిపారు . తనపై నమ్మకంతో నియామకం చేసిన తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర చైర్మన్ కోటూరి మానవతారాయ్ గారికి , సహకరించిన న్యాయవాది శేర్ నర్సారెడ్డి లకు కృతజ్ఞతలు తెలిపారు.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

Tags: Talla Pelli Satyanarayana Gowda as Telangana Student Unemployment JAC District Chairman

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page