నవీన్ లా ఉన్నా బాగుండేది.. తమ్ముళ్ల అంతర్మధనం

0 25

గుంటూరు ముచ్చట్లు:

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇక మారరు. ఆయన వ్యూహాలు పాత పద్ధతిలోనే కొనసాగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఇక ఒంటరిగా పోటీ చేసే అవకాశం లేదని ఆయన పదే పదే సంకేతాలు ఇస్తున్నారు. ఇది క్యాడర్ లో, నేతల్లో ధైర్యం నింపేందుకే అని చెబుతున్నా జరగబోయేది అదే. పొత్తులతోనే చంద్రబాబు వచ్చే ఎన్నికలకు వెళతారన్నది వాస్తవం. కులాలు, మతాల పరంగా, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా ఉండాలంటే ఒంటరిపోరుకు స్వస్తి చెప్పాల్సిందేనన్నది చంద్రబాబు నిర్ణయం.నిజానికి చంద్రబాబు ఎప్పుడూ ఒంటరిగా పోటీ చేసి గెలవలేదు. 2019 ఎన్నికల్లో అతి విశ్వాసంతో ఆయన ఒంటరిగా ఎన్నికలకు వెళ్లి బొక్కా బోర్లా పడ్డారు. ఏపీకి తనను మించిన నేత లేడనే భావించడమే ఆ ఎన్నికల్లో చంద్రబాబు ఒంటరి పోరుకు కారణంగా చెప్పాలి. బీజేపీ పై ఉన్న వ్యతిరేకత తనకు అనుకూలంగా మారుతుందని చంద్రబాబు భావించారే తప్పించి, జగన్ కు అనుకూలంగా మారుతుందని ఊహించలేకపోయారు.ఇక చంద్రబాబు ఇప్పుడు బీజేపీ, జనసేన మీదనే ఆశలు ఎక్కువగా పెట్టుకున్నారు.

 

- Advertisement -

వారితో కలసి వెళితేనే 2024 ఎన్నికల్లో విజయం దక్కుతుందన్నది చంద్రబాబు ఆలోచన. అయితే బీజేపీ ఎంతమేరకు సహకరిస్తుందో లేదో తెలియదు. కానీ బీజేపీతో మాత్రం సఖ్యతగానే వెళ్లాలనుకుంటున్నారు. నిజానికి ఇప్పుడు బీజేపీపై దేశ వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో దానికి దూరంగా ఉండటమే బెటర్. నిజానికి పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో మమత బెనర్జీ బీజేపీని ఢీ కొట్టి మరీ తిరిగి అధికారాన్ని నిలుపుకోవడాన్ని కొందరు గుర్తు చేస్తున్నారు.మమత బెనర్జీ లా చంద్రబాబు ఎఫెన్స్ లా వెళ్లకపోయినా, కనీసం నవీన్ పట్నాయక్ మాదిరి వ్యవహరించి ఉంటే బాగుండేదని పార్టీలో పలు సూచనలు విన్పిస్తున్నాయి. నవీన్ పట్నాయక్ ఎప్పుడు బీజేపీతో పొత్తులు పెట్టుకోలేదు. అలాగని తగవులు పెట్టుకోలేదు. దీనిని వదిలేసి బీజేపీ తో పొత్తు కోసం వెంపర్లాడటం, చంద్రబాబు ఆరాటం పార్టీలో చర్చనీయాంశమైంది. తమ అధినేత ఎన్నికలకు మూడేళ్ల ముందు నుంచే బీజేపీ భజన చేయడం తగదన్న కామెంట్స్ ఆ పార్టీ నుంచి విన్పిస్తున్నాయి. మొత్తం మీద చంద్రబాబు పొత్తుల కోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలు పెట్టారనుకోవాలి. కానీ అది ఎంతవరకూ సాధ్యమనేది కాలమే సమాధానం చెప్పాలి.

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

Tags:Naveen Law would have been better .. Tammulla Antarmadhanam

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page