పాలెపల్లిలో షర్మిల పర్యటన

0 18

వికారాబాద్ ముచ్చట్లు:

 

వైఎస్ షర్మిల వికారాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా దోమ మండలం పాలెపల్లిలోని వరి కొనుగోలు కేంద్రం వద్ద ఉన్న వరి ధాన్యాన్ని  పరిశీలించారు. రైతులతో పాటు నేలపై కూర్చొని  రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.వరి కొనుగోలు కేంద్రం వద్ద వారు పడుతున్న సమస్యలను షర్మిలకు వివరించారు రైతులు.తేమ శాతం,తాళు అంటూ మూడు నుంచి ఐదు కిలోల వరకు తరుగు తీస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.కొనుగోలు కేంద్రాల క్లస్టర్ ఇంచార్జి జంగయ్యతో షర్మిల ఫోన్ లో మాట్లాడారు. పొలాల్లో మొలకెత్తాల్సిన ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద మొలకెత్తుతున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు.మొలకెత్తిన ధాన్యంతో పాటు రైతు దగ్గర ఉన్న ప్రతి గింజ కొనాలని….లేదంటే రైతులు ఇళ్ళ వద్ద వచ్చి ధర్నా చేస్తారని హెచ్చరించారు.ఈ రైతుల సమావేశంలో తమ సమస్యలు చెప్పుకునేందుకు వీఆర్వోలు,నిరుద్యోగులు,విధ్యార్థులు కూడా వచ్చారు.వీఆర్వో వ్యవస్థ రద్దు చేసి ఏడాది గడుస్తున్నా తమ పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదని వీఆర్వోలు ఆవేదన వ్యక్తంచేశారు.ఫీజు రీఅంబర్స్ మెంట్ లేదని,నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవని అన్నారు.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

Tags: Sharmila’s visit to Palepally

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page