పుంగనూరు కరోనా తీవ్రంగా ఉన్న ప్రాంతాలలో లాక్‌డౌన్‌ -కమిషనర్‌ కెఎల్‌.వర్మ

0 378

పుంగనూరు ముచ్చట్లు:

 

 

మున్సిపాలిటి పరిధిలో కరోనా తీవ్రంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి , ఆ ప్రాంతాల్లో పూర్తిగా లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు కమిషనర్‌ కెఎల్‌.వర్మ తెలిపారు. శుక్రవారం ఆయన మున్సిపాలిటిలోని శానిటరీ సెక్రటరీలతో సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌ హరినారాయణ్‌ ఆదేశాల మేరకు వార్డుల వారీగా కరోనా రోగులను గుర్తిస్తున్నామన్నారు. సంఖ్యను బట్టి ఆప్రాంతాలను పూర్తిగా లాక్‌డౌన్‌ చేస్తామన్నారు. పోలీసులు , వైద్య సిబ్బందితో కలసి రోగులకు , వారి సన్నిహితులకు సౌకర్యాలు కల్పిస్తామన్నారు. పట్టణంలో ఫీవర్‌ సర్వే కొనసాగుతోందన్నారు. కరోనా లక్షణాలు ఉన్న వారిని హ్గం ఐసోలేషన్‌లో కానీ, కోవిడ్‌ సెంటర్‌లో ఉంచేలా తగు ఏర్పాట్లు చేశామన్నారు. ప్రతి రోజు పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టి, వ్యాదులు ప్రభలకుండ జాగ్రత్తలు చేపట్టినట్లు తెలిపారు. అలాగే తడిచెత్త, పొడిచెత్తను వేరుచేసి ప్రతి ఇంటి నుంచి సేకరిస్తున్నామని, హానికార చెత్తను సేకరించేందుకు జూలై 7 నుంచి ఈ ఆటోను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ఇందు కోసం ఒకొక్క ఇంటి నుంచి హానికార చెత్తకు ఒక ఇంటి నుంచి రూ.2 లు వసూలు చేయనున్నట్లు తెలిపారు. ఈ విషయమై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రతి ఒక్కరు మాస్క్లు ధరించి, భౌతికదూరం పాటించాలని సూచించారు. అవసరం ఉన్న వారు మినహా ఎవరు బయటకు రావద్దన్నారు. ఈ సమావేశంలో మేనేజర్‌ రసూల్‌ఖాన్‌, అకౌంట్స్ ఆఫీసర్‌ మనోహర్‌, ఏఈ కృష్ణకుమార్‌, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ సఫ్ధర్‌, పాల్గొన్నారు.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

Tags: Lockdown – Commissioner KL Verma in areas where Punganur corona is severe

 

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page