పునరావాస కాలనీలను సందర్శించిన కలెక్టర్ కార్తికేయ మిశ్రాకుక్కునూరు

0 10

వేలేరుపాడు  ముచ్చట్లు:

 

పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాలు కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా పర్యటించారు. శుక్రవారం కుక్కునూరు మండలంలోని వెంకటాపురం,మర్రిపాడు గ్రామాల్లో పోలవరం నిర్వాసితుల కోసం నిర్మిస్తున్న  కాలనీల నిర్మాణాన్ని ఆయన పరిశీలించారు. త్వరితిగతిన ఇళ్ళు పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పోలవరం నిర్వాసితులకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో ప్యాకేజీ 10 లక్షల 50 వేలు ఇస్తానని హామీ ఇచ్చిన ప్రకారం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ 10 లక్షలు మరియు ప్రస్తుతం నివాసం ఉంటున్న ఇంటి విలువలు ఇచ్చిన తరువాతనే తరలించాలని, పునరావాస కాలనీలలో పూర్తి స్థాయి మౌలిక సాదుపాయలతో ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేసి నిర్వాసితులకు అప్పగించాలని, పునరావాస కాలనీలలో ఇండ్లు వద్దు, స్థలం మరియు ఇంటి విలువ కావలని ఆఫిడవిడ్ ఇచ్చిన నిర్వాసితులకు 5 సెంట్ల స్థలం రిజిస్ట్రేషన్ చేసి ఇంటి విలు చెల్లించాలని, ప్రతి పక్ష నేతగా వై.యస్. జగన్మోహన్ రెడ్డిగారు నిర్వాసితులకు ఇచ్చిన హామి ప్రకారం ఆర్ & ఆర్ ప్యాకేజీ 10 లక్షలు గతంలో, 2006-07లలో పరిహారం పొందిన భూములకు 5 లక్షల పరిహారం అమలు అయ్యే విధంగా జి.వో జారి చేయ్యాలని, పునరావాసం కల్పించే సమయానికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువతి, యువకులకు ఆర్ & ఆర్ ప్యాకేజి ఇవ్వాలని, కాఫర్ డ్యాం నిర్మాణం వలన గోదావరి బ్యాక్ వాటర్ స్టోర్ అయ్యాయి.

 

 

 

- Advertisement -

కానున వరదలు సమయంలో గ్రామాలను ముందస్తుగా ఖాళీ చేయించి, పునరావాస కాలనీలకు తరలి వెళ్ళాలని అధికారులు చెపుతున్నారని అక్కడ ఎటువంటి ఉపాధి అవకాశాలు లేక ప్రజలు ఇబ్బంది పడతారు కావున, అట్టి గ్రామాలకు మందుగా ఆర్ & ఆర్ ప్యాకేజి ఇవ్వాలి. ప్రతి కుటుంబానికి 7500 నెలకు పరిహారం, 50 కేజిలు, నిత్యావసర వస్తువులు ప్రభుత్వం అందించాలని, కారోన తీవ్రత ఉధృతిగా ఉన్నందున ఈ విపత్తులో నిర్వాసితులకు ఆరోగ్య భరోసను కల్పించి, పునరావాస కేంద్రాలలో 50 పడకల కోవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేయ్యాలని, అధికారులు నిర్వాసితులను బెదిరించి ధోరణిలో కాకుండా, అన్ని గ్రామాలలో ప్రజలు అభిప్రాయాలను సేకరించి ప్రజలకు నచ్చిన విధంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలని, వాట్సాప్ మేసేజ్ ఆధారంగా నిర్వాసితుల జాబితా నుండి తొలగించిన

 

 

 

 

పేర్లను విచారణ చేసి వెంటనే నిర్వాసితుల జాబితాలో చేర్చాలని, ముంపు ప్రాంతాల నిరుద్యోగులకు, పోలవరం ప్రాజెక్టు వద్ద నిర్మించే పవర్ ప్లాంట్ లో ఉద్యోగాలు ఇవ్వాలి. కుక్కునూరు మండలం యూనిట్ గా భూ సేకరణ జరపాలని అదే విధంగా మండలం యూనిట్గా అందరికి ఆర్ & ఆర్ ప్యాకేజి ఇవ్వాలని, కుక్కునూరు మండలంలోని  మిగులు భూముల పరిహారం ఇవ్వాలనే డిమాండ్లుతో కూడిన
వినతిపత్రాన్ని ఆయనకు అందజేశారు. కుక్కునూరు పిహెచ్సినీ విజిట్ చేశారు. వ్యాక్సినేషన్ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వేలేరుపాడు మండలంలోని కోయిదా,కట్కూరు గ్రామాలను సందర్శించారు. ఈ కార్యక్రమంలో పోలవరం భూసేకరణ అధికారి ఆనంద్ బాబు,డిఎస్పీ శ్రీలతాకుమారి, తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

 

 

Tags: Collector Karthikeya Mishrakukkunur visiting the resettlement colonies

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page