పెట్రోలు డీజిల్ ధరలు తగ్గించాలని  కాంగ్రెస్ నిరసన

0 6

ఏలూరుముచ్చట్లు:

 

ఏలూరు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం  బైపాస్ రోడ్డు  జంగారెడ్డిగూడెం- బుట్టాయిగూడెం బైపాస్ జంక్షన్  హెచ్ పి పెట్రోల్ బంకు దగ్గర పెట్రోలు డీజిల్ ధరలు తగ్గించాలని నిరసన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు జెట్టి గురునాధరావు  మాట్లాడుతూ భారతదేశంలో బిజెపి ప్రభుత్వం  పెట్రోలు డీజిల్ ధరలు వంద రూపాయలు పైబడి పెంచాయి , ఒకే నెలలో 20 సార్లు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచటం దారుణమని అన్నారుజ ప్రస్తుతం ఈ కోవిడ్  టైంలో వ్యాపారాలు లేక,  వ్యవసాయ పనులు లేక, సరైన పనులు లేక  ప్రజలు దుర్భరమైన పరిస్థితుల్లో ఉండగాఅందరూ సాయపడాలని, సహాయం చేయాలని కోరుకుంటున్నాం.  అనేక మంది సహాయ సహకారాలు అందిస్తూ అవసరమైనవారికి సహాయం చేస్తున్నారు. ప్రజలు దుర్భరమైన పరిస్థితుల్లో ఉంటే బిజెపి ప్రభుత్వం పెట్రోలు డీజిల్ ధరలు ప్రతిరోజు పెంచటం దారుణమైన విషయమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా గా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని ప్రజల తరఫున నిరసన తెలియజేస్తున్నాము అని అన్నారు. ఈ కార్యక్రమంలో పిసిసి అధికార ప్రతినిధి మద్దాల ప్రసాద్, ముప్పిడి శ్రీనివాసరావు, నులకాని నాగబాబు,  వీరవెల్లి సోమేశ్వర రావు, మొగల్ని డి శ్యాం, జ్ఞాని దాకా వరపు రవి, జమీరు, కొల్లి రామ సూరి రెడ్డి, మెగా టైలర్ రామారావు, మద్దిపాటి శ్రీను, లంకలపల్లి శ్రీను, చిన్నo రాంబాబు , ఆటో రామకృష్ణ, వసంతటి మంగరాజు, నరం శ్రీను, షరీఫ్ పులపాక లు గాంధీ, అనిశెట్టి వెంకన్నబాబు తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

Tags:Congress protests to reduce petrol and diesel prices

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page