పెట్రోల్  డీజిల్ పెంపుకు నీరసంగా కాంగ్రెస్ నేతల ధర్నా డిసిసి అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాసరావు గుప్తా

0 7

కామారెడ్డి ముచ్చట్లు:

ఏఐసీసీ, పీసీసీ ఆదేశాలతో పాటు, మాజీ మంత్రి  షబ్బీర్ అలీ  ఆదేశాల మేరకు
కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ రావ్ గుప్తా  ఆధ్వర్యంలో నిజాంసాగర్ చౌరస్తా బర్మా షల్ పెట్రోల్ బంకు ఎదురుగా శుక్రవారం  ధర్నా,నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది . కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అరగంటపాటు నినాదాలు చేస్తూ,  పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు దించేవరకు ఆందోళనలు చేస్తామని కైలా శ్రీనివాసరావు హెచ్చరించారు. బిజెపి ప్రభుత్వం గద్దెనెక్కి ఏడు సంవత్సరాలు దాటినా బీద ప్రజలకు మాత్రం ఒరిగిందేమీ లేదు కేవలం ఐదు నెలల్లోనే నలభై నాలుగు సార్లు పెట్రోల్ డీజిల్ పై రేట్లు పెంచడం మోడీకి ఇది తగునా అన్నారు.  బీద, మధ్య తరగతి ప్రజల పై సామాన్య ప్రజల పై తీవ్ర మైన భారం పడిందని,  ఇప్పటి కైనా ప్రధాన మంత్రి మోడీ  గమనించి పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని కైలాస్ శ్రీనివాస్ డిమాండ్ చేశారు.  ఇట్టి కార్యక్రమం లో కాంగ్రెస్ నేతలు పండ్ల రాజు ,  గుడుగుల శ్రీనివాస్,  కారంగుల అశోక్ రెడ్డి,  మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అన్వర్ అహమద్ , జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ నారెడ్డి మోహన్ రెడ్డి, మున్సిపల్ విప్ పాత శివ కృష్ణ మూర్తి , మున్సిపల్ కౌన్సిలర్ మొహమ్మద్ షేరు,  పాక రవిప్రసాద్ , మాజీ కౌన్సిలర్లు బట్టు మోహన్, గొనె శ్రీనివాస్, పంపరి లక్ష్మణ్, గూడూరి  సునీల్ గౌడ్, సంపత్ గౌడ్, మొహమ్మద్ సర్వర్, గుడ్ల శ్రీనివాస్ యాదవ్, వి ఎస్ భాస్కర్, సయ్యద్ ముబషీర్ జమీల్, ఎజాజ్, కుర్షిద్, శ్రీనివాస్ రెడ్డి, ముదాం శ్రీనివాస్, హనుమండ్ల రవి, షాహెడ్, సవురాలశంకర్ మరియూ యాత్ కాంగ్రెస్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

 

Tags:Congress leaders dharna over petrol, diesel hike
DCC President Kailash Srinivasa Rao Gupta

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page