పైడిమర్రి ‘ప్రతిజ్ఞ’- పైడిమర్రి వెంకట సుబ్బారావు జయంతి

0 8

అమరావతి ముచ్చట్లు:

 

‘భారతదేశము.. నా మాతృభూమి.. భారతీయులందరూ నా సహోదరులు’ ఇది .. భారతీయులందరూ చేసే ప్రతిజ్ఞ. అత్యున్నత భావాలతో భారతదేశ గౌరవాన్ని ఇనుమడింపచేస్తూ.. ఐకమత్యంగా ఉండటానికి దోహదపడే ఈ ప్రతిజ్ఞ..భారతీయులందరికీ గర్వకారణమైనది. మరి ఇలాంటి ఉదార్తమైన..ఉత్కృష్టమైన దేశభక్తిని పెంపొందించే ఈ ప్రతిజ్ఞను రాసింది ఎవరో తెలుసా..?

 

- Advertisement -

ఆయన మరెవరో కాదు.. మన తెలుగువాడు. నల్గొండ జిల్లాలో అన్నెపర్తిలో జన్మించారు. ఆయనే పైడిమర్రి వెంకట సుబ్బారావు. అయితే ఆయనకు ఇవ్వాల్సినంత గౌరవం దక్కలేదు. అలాగే ప్రచారం జరగలేదు. ఇప్పటికీ చాలామందికి మన ప్రతిజ్ఞ రాసింది మన తెలుగువాడు పైడిమర్రి రాసారని తెలియకపోవడం మన దురదృష్టం. నేడు ఆయన జయంతి సందర్భంగా ఆ మహానుభావుడిని గుర్తుచేసుకుందాం.. నివాళులర్పిద్దాం..

 

పైడిమర్రి వెంకట సుబ్బారావు  1916 జూన్ 10న నల్లగొండ జిల్లా అన్నెపర్తిలో జన్మించారు. వీరికి ప్రకృతి వైద్యం.. హోమియో వైద్య విధానాలలో ఉన్న ఆసక్తితో ప్రజలకు వైద్య సేవలందించేవారు. ఆయనకు తెలుగు, ఇంగ్లీషు, హిందీ, సంస్కృతం, అరబిక్ భాషల్లో గట్టి పట్టు ఉంది.. రాష్ట్ర ట్రెజరీ విభాగంలో ఉద్యోగరీత్యా వివిధ జిల్లాల్లో పని చేశారు.

 

పుస్తకసేకరణ, కవిత్వం, కథలు రాయడంపట్ల ఆయనకు ఎంతో ఆసక్తి ఉండేది. సాహిత్యాభిలాషతో ఎన్నో కథలు కూడా రాశారు. వీరి 18వ ఏటనే ‘కాలభైరవుడు’ అనే నవల రాశారు. నాటకాలు, శతకాలు రాశారు. ఆయన రాసిన ‘ప్రతిజ్ఞ’ ..1965 జనవరి 26నుంచి దేశమంతటా అమలులోకి వచ్చింది. 75 ఏళ్ల వయసులో 1988 ఆగస్టు 13న పైడిమర్రి వెంకట సుబ్బారావుగారు స్వర్గస్తులయ్యారు.

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

 

Tags: Paidimarri ‘Pledge’ – Paidimarri Venkata Subbarao Jayanti

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page