ముందే క్షుద్రపూజలు.. తర్వాత బ్లాక్ మెయిల్

0 23

విజయవాడ  ముచ్చట్లు:

ఓ వైపు టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతుంటే.. మరోవైపు కొంతమంది ఇంకా మూఢవిశ్వాసాలను పట్టుకుని వేలాడుతున్నారు. దీన్ని ఆసరాగా తీసుకుని కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనే కృష్ణా జిల్లాలో వెలుగుచూసింది. క్షుద్ర పూజల పేరిట ప్రజలను నమ్మించి నిలువునా దోపిడీకి పాల్పడుతున్న ముఠా గుట్టును గూడూరు పోలీసులు అరెస్ట్ చేశారు.గుంటూరులోని శారదా నగర్‌ కాలనీలో నివాసం ఉండే వినుకొండ సుబ్బారావు, వినుకొండ శివపార్వతి దంపతులు క్షుద్ర పూజలు నిర్వహిస్తుంటారు. అనారోగ్యంతో బాధపడుతున్న గూడూరు మండలానికి చెందిన యువతిని తల్లిదండ్రులు వీరి వద్దకు తీసుకొచ్చారు. ఆమె పేరిట ఎవరో తాంత్రిక పూజలు చేయడంతోనే అనారోగ్యం పాలైందని, తాము క్షుద్రపూజలు చేసి నయం చేస్తామని నమ్మించారు. వారి మాయమాటలు నమ్మిన బాధితురాలి తల్లిదండ్రులు యువతికి పూజలు నిర్వహించడానికి అంగీకరించారు.దీంతో వారు యువతిని అర్ధనగ్నంగా కూర్చోబెట్టి పూజలు చేస్తూ వీడియోలు తీశారు. అప్పటి నుంచి అడిగినంత డబ్బు ఇవ్వకపోతే యువతి అర్ధనగ్న వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తామని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. దీంతో విసిగిపోయిన బాధితులు ఈమెయిల్ ద్వారా పోలీసులను ఆశ్రయించారు. దీనిపై స్పందించిన సీఐ కొండయ్య ఆదేశాల మేరకు గూడూరు ఎస్ఐ దుర్గాప్రసాద్‌ కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాల సాయంతో నిందితులను పట్టుకున్నారు. క్షుద్ర పూజల పేరిట ఎవరైనా మాయమాటలు చెప్పడానికి ప్రయత్నిస్తే నమ్మి మోసపోవద్దని సీఐ హితువు హెచ్చరించారు.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

 

Tags: Kshudrapujas first .. then blackmail

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page