రఘురామకృష్ణరాజును డిస్ క్వాలిఫై చేయండి  లోక్ సభ స్పీకర్ కు చీఫ్ విప్ భరత్ ఫిర్యాదు

0 25

న్యూఢిల్లీ ముచ్చట్లు:
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద నర్సాపురం నుంచి ఎంపీగా ఎన్నికై, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఎంపీ కె. రఘురామకృష్ణరాజు పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలని లోక్ సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లాకు లోక్ సభలో పార్టీ చీఫ్ విప్ మార్గాని భరత్ ఫిర్యాదు చేశారు.
రఘురామకృష్ణరాజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ చేసిన వ్యాఖ్యలపై గతంలోనే ఆధారాలను తాము లోక్ సభ స్పీకర్ కు సమర్పించామని, అనేక పర్యాయాలు డిస్ క్వాలిఫికేషన్ కు సంబంధించి స్పీకర్ ను కలిసి విజ్ఞప్తి చేశామని, రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అతిక్రమించిన రఘురామకృష్ణరాజును వెంటనే డిస్ క్వాలిఫై చేయాల్సిందిగా ఈరోజు మరోసారి లోక్ సభ స్పీకర్ ను కలిసి విజ్ఞప్తి చేశామని  భరత్ తెలిపారు.

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

- Advertisement -

Tags:Disqualify Raghuram Krishnaraja
Chief Whip Bharat complains to Lok Sabha Speaker

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page