లింక్ కోసం క్యూలు…

0 20

ఏలూరు ముచ్చట్లు:

పుట్టుక, మరణ ధృవీకరణ పత్రాల మంజూరులో జాప్యం లబ్ధిదారుల పాలిట శాపంగా మారుతోంది. దరఖాస్తుల విచారణ పేరుతో అధికారయంత్రాంగం చేస్తున్న జాప్యం కొంత కారణంగా పేర్కొనవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో అవసరమైన సర్టిఫికెట్లను సకాలంలో పొందలేకపోతున్నారు. దీంతో ప్రభుత్వ పధకాల ద్వారా లబ్ధి పొందలేక పోతున్నారు. సంక్షేమ పధకాలతో పాటు ఇతరత్రా లబ్ధి పొందాలంటే ఆయా సర్టిఫికెట్లు తప్పని సరిగా జతపరచాల్సి ఉంటుంది. ఆలస్యంగానైనా కూడా బర్త్‌ సర్టిఫికెట్ల కోసం దరఖాస్తులు చేసుకునే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. 2014 నుంచి 2021 జూన్‌1 వరకు బర్త్‌, డెత్‌ సర్టిఫికెట్ల కోసం సుమారు 15లక్షలకు పైగా ప్రభుత్వానికి వినతులు అందాయి. సంక్షేమ పధకాల్లో లబ్ది పొందేందుకు వయస్సు ధృవీకరణ తప్పనిసరి. వాస్తవ వయస్సుకు ఆధార్‌లో నమోదైన తేదీలకు సరిపోక పోవడంతో ఆధార్‌ అప్‌డేట్‌ చేసుకోవాలంటే బర్త్‌ సర్టిఫికెట్‌ తప్పనిసరి.

 

- Advertisement -

పాఠశాలల్లో పిల్లలను చేర్చే సమయంలో కచ్చితంగా డేట్‌ ఆఫ్‌ బర్త్‌ సర్టిఫికెట్‌ కావాలని పాఠశాల యాజమాన్యాలు కోరుతుండటంతో ఆలస్యంగా సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. 2014 జూన్‌2 నుంచి 2021 మే31 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 12,22,291 దరఖాస్తులు పుట్టినరోజు సర్టిఫికెట్లు మంజూరు చేయాలంటూ రెవెన్యూ కార్యాలయాలకు దరఖాస్తులు అందాయి. ఇందులో 9,36,116 మంజూరు చేయగా, 2,73,283 దరఖాస్తులను అధికారులు తిరస్కరించారు. ఇది ఇలా ఉంటే మరణ ధృవీకరణ సర్టిఫికెట్ల కోసం ఆలస్యంగా దరఖాస్తులు చేసుకునే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. బీమా సౌకర్యం పొందాలన్నా, కుటుంబ యజమాని మరణించిన సమయంలో వారసులకు ప్రాపర్టీ సర్టిఫికెట్‌తో పాటు లీగల్‌ హైర్‌ సర్టిఫికెట్‌ తప్పనిరి. 2014 జూన్‌1నుంచి 2021 మే 31 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2,10,635 మంది దరఖాస్తు చేసుకోగా ఇందులో 95,559 సర్టిఫికెట్లు మంజూరు చేయగా 1,08,433 వివిధ కారణాలతో అధికారులు తిరస్కరించారు. మరణ ధృవీకరణ సర్టిఫికెట్ల కోసం అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లా నుంచి 27,893 మంది ఉండగా రెండో స్ధానంలో 24,755 దరకాస్తులతో చిత్తూరు జిల్లా రెండో స్దానంలో ఉంది. డెత్‌ సర్టిఫికెట్లు దరఖాస్తులు తిరస్కరణకు గురవడానికి ముఖ్యంగా చనిపోయిన తేదీ, ప్రదేశం దరఖాస్తులో పేర్కొన్న ప్రాంతం కాకుండా ఇతర ప్రాంతాల్లో చనిపోవడం, దరఖాస్తు చేసుకున్న నగరంలో రికార్డులు సరిపోకపోవడం, న్యాయపరమైన సమస్యలను కారణంగా అధికారులు పేర్కొంటున్నారు.

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

Tags:Queues for link …

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page