లోక‌సంక్షేమం కోసం యుద్ధ‌కాండ పారాయ‌ణం ప్రారంభం

0 27

– వ‌సంత మండ‌పంలో 30 రోజుల పాటు పారాయ‌ణం

 

తిరుమల ముచ్చట్లు:

 

- Advertisement -

లోక సంక్షేమం కోసం, క‌రోనా వ్యాధిని అరిక‌ట్టాల‌ని శ్రీ‌వారిని ప్రార్థిస్తూ యుద్ధ‌కాండ పారాయ‌ణ‌ము తిరుమ‌ల‌లోని వ‌సంత మండ‌పంలో శుక్ర‌వారం ఉద‌యం శాస్త్రోక్తంగా ప్రారంభ‌మైంది. ఈ దీక్ష జూలై 10వ తేదీ వ‌ర‌కు జ‌రుగ‌నుంది.శరణాగతి మ‌హామంత్రం ప్ర‌కారం మొద‌టి రోజు ” స ” అనే అక్ష‌రానికి ఉన్న బీజాక్ష‌రాల ప్ర‌కారం యుద్ధ‌కాండ‌లోని 1 నుండి 7వ స‌ర్గ వ‌ర‌కు ఉన్న 272 శ్లోకాలు, బాల‌కాండ, యోగ‌వాశిష్ఠంలోని విషూచిక మ‌హామంత్రంలోని 100 శ్లోకాలు కలిపి మొత్తం 372 శ్లోకాలు పారాయ‌ణం చేశారు. ఇందులో భాగంగా మొద‌ట సంక‌ల్పంతో ప్రారంభించి శ్రీ‌రామ ప్రార్థ‌న‌, శ్రీ ఆంజ‌నేయ ప్రార్థ‌న‌, శ్రీ వాల్మీకి ప్రార్థ‌న చేశారు. ఆ త‌రువాత 16 మంది ఉపాస‌కులు శ్లోక పారాయ‌ణం చేశారు. శ‌నివారంనాడు 8వ‌ స‌ర్గలోని 24 శ్లోకాల‌ను పారాయ‌ణం చేయ‌నున్నారు.

 

 

 

ధ‌ర్మ‌గిరి వేద పాఠ‌శాల ప్రిన్సిపాల్ ఆచార్య కుప్పా శివ‌సుబ్ర‌హ్మ‌ణ్య అవ‌ధాని మాట్లాడుతూ సీతా స‌మేతుడైన శ్రీ‌రామ‌చంద్ర‌మూర్తి, ఆంజ‌నేయ‌స్వామివారి అ‌నుగ్ర‌హంతో ప్ర‌పంచంలోని మాన‌వులు ధ‌ర్మాని ఆచ‌రిస్తూ, స‌క‌‌ల శుభాల‌ను పొందాల‌ని ఆకాంక్షిస్తూ 30 రోజుల పాటు యుద్ధ‌కాండ పారాయ‌ణ కార్య‌క్ర‌మం జ‌రుగుతుంద‌న్నారు. ఇందులో రాములవారు వాన‌ర సైన్యంతో రావ‌ణుని లంకాన‌గ‌రం చేరుకుని రాక్ష‌స వీరుల‌ను సంహ‌రించిన‌ట్లు, ఈ పారాయ‌ణం వ‌ల‌న స్వామివారు క‌రోనా మ‌హ‌మ్మ‌రిని సంహ‌రించి ప్ర‌పంచంలోని మాన‌వుల‌కు ఆయురారోగ్యాల‌ను ప్ర‌సాదిస్తార‌న్నారు. యుద్ధ‌కాండ‌లో 131 స‌ర్గ‌ల లోని 5783 శ్లోకాల‌ను 30 రోజుల పాటు వేద శాస్త్ర‌ పండితులు అత్యంత దీక్షా శ్రద్ధలతో పారాయ‌ణం చేయ‌నున్నార‌ని తెలిపారు. వ‌సంత మండ‌పంలో శ్లోక పారాయ‌ణంతోపాటు ధ‌ర్మ‌గిరి వేద పాఠ‌శాల‌లో మ‌రో 16 మంది ఉపాస‌కులు 30 రోజుల పాటు జ‌ప – త‌ర్ప‌ణ – హోమ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తార‌ని వివ‌రించారు.

 

 

 

 

ప్ర‌పంచవ్యాప్తంగా ఉన్న శ్రీ‌వారి భ‌క్తుల కోసం ప్ర‌తిరోజూ ఉద‌యం 8.30 గంట‌ల నుండి ఈ కార్య‌క్ర‌మాన్ని ఎస్వీబీసీలో ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తార‌న్నారు. భ‌క్తులు ఈ ప‌రాయ‌ణంలోని శ్లోకాల‌ను వీక్షించిన‌, ప‌ఠించిన‌, శ్ర‌వ‌ణం చేసిన సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంద‌న్నారు.శ్రీ‌వారి స‌న్నిధిలోని వ‌సంత మండ‌పంలో ” స‌కృదేవ ప్ర‌ప‌న్నాయ‌త వాస్మీతి చ‌యాచ‌తే అభ‌యం స‌ర్వ‌భూతేభ్యః ద‌దామ్యే త‌ద్వ్ర‌తం మ‌మ‌ ” మ‌హామంత్రంలో 32 అక్ష‌రాలు ఉన్నా‌యి. ఒక్కొక్క అక్షరానికి బీజాక్ష‌రాలు ఉన్నాయి. వీటిని క‌ట‌ప‌యాది వ‌ర్గం చేత 30 రోజులుగా ప‌రిగ‌ణించి నిర్ధిష్ట‌మైన సంఖ్య‌లో శ్లోకాలు పారాయ‌ణం చేయ‌డం జ‌రుగుతుంది.ఈ కార్య‌క్ర‌మంలో ఎస్వీబిసి సిఇవో   సురేష్‌కుమార్‌, ఎస్వీ ఉన్న‌త వేదాధ్య‌య‌న సంస్థ ప్రాజెక్టు అధికారి డా. ఆకెళ్ల విభీష‌ణ‌శ‌ర్మ, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

 

Tags: The beginning of the recitation of the war for the welfare of the world

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page