వైఎస్ఆర్ సుజల మినరల్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన వైసిపి నాయకులు

0 17

తుగ్గలి ముచ్చట్లు:

 

తుగ్గలి మండల పరిధిలోని రామకొండ,రాంపల్లి గ్రామాలలో శుక్రవారం వైయస్సార్ సుజల మినరల్ వాటర్ ప్లాంట్ ను సర్పంచులు మరియు వైసీపీ నాయకులు ఘనంగా ప్రారంభించారు.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి పత్తికొండ మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్ నాగభూషణ్ రెడ్డి,వైఎస్ఆర్సీపీ నాయకుడు రామకొండ సుధాకర్ రెడ్డి,ఐ.టి వింగ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పరపల్లి సురేంద్ర నాథ్ రెడ్డి లు పాల్గొని సర్పంచులు హారిక,మునీంద్ర తో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో ప్రజలందరికీ స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామంలో మినరల్ వాటర్ ట్యాంక్ ను ఏర్పాటు చేశామని వారు తెలియజేశారు. ఉప్పరపల్లె గ్రామంలో 3 కోట్ల 10 లక్షల రూపాయలతో నిర్మించిన మినరల్ వాటర్ ప్లాంటు ను ఎమ్మెల్యే శ్రీదేవి సహాయ సహకారాలతో ఈ మినరల్ వాటర్ వాటర్ ప్లాంట్ ప్రారంభించామని వారు తెలియజేశారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టే ప్రతి ఒక్క పథకాలు సచివాలయ మరియు వాలంటీర్ల వ్యవస్థ ద్వారా నేరుగా లబ్ధిదారులకు చేరుతున్నాయి అని వారు తెలియజేశారు.ఎమ్మెల్యే సహకారంతో మండలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని వారు తెలియజేశారు. ఎమ్మెల్యే సహాయ సహకారాలతో మండల వ్యాప్తంగా తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కార మార్గం చూపామని వారు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సచివాలయం పంచాయతీ కార్యదర్శి ప్రభాకర్,రైతు ఉత్పత్తి దారుల సంఘం అధ్యక్షుడు భీమానాయక్, వైఎస్ఆర్సిపి నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

 

Tags: YCP leaders launch YSR Sujala Mineral Water Plant

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page