వ్యాక్సిన్ తర్వాత అయస్కాంత శక్తి

0 18

ముంబై ముచ్చట్లు:

 

కోవిడ్ టీకా తీసుకున్న తర్వాత తన శరీరంలో అయస్కాంత శక్తి ఉత్పన్నమయ్యిందని, ఇనుము ఉక్కు పదార్థాలు తన శరీరానికి అతుక్కుపోతున్నాయని ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు. రెండో డోస్ తీసుకున్న తర్వాత ఇలా జరిగిందంటూ మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాకు చెందిన అరవింద్ జగన్నాథ్ సోనార్ షేర్ చేసిన వీడియోలో అతడికి స్ఫూన్‌లు, చిన్న ప్లేట్స్ అతుక్కుపోతున్నట్లుగా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అరవింద్ జగన్నాథ్ సోనార్ కొద్ది రోజుల కిందట సెకండ్ డోస్ తీసుకున్నాడు. అప్పటి నుంచే ఈ వింత శక్తి కనిపిస్తోందని జగన్నాథ్ ఆరోపిస్తున్నాడు.తొలుత చెమట కారణంగా ఇనుప వస్తువుల శరీరానికి అతుకుతున్నాయని జగన్నాథ్ సహా కుటుంబ సభ్యులు భావించారు. కానీ, స్నానం చేస్తున్న సమయంలోనూ ఇనుప వస్తువులు తన శరీరానికి అంటుకోవడం చూసి షాక్ అయ్యాడు. ఈ వింత కేసుపై వైద్యులు స్పందించారు. ఆయన శరీరానికి ఇనుప వస్తువులు అంటుకోడానికి, వ్యాక్సిన్‌కు ఎటువంటి సంబంధం లేదని వైద్యాధికారులు పేర్కొన్నారు.

 

 

 

 

- Advertisement -

దీనిపై పరిశోధన అవసరమని, ఈ అంశంలో ఉన్నతాధికారులు అభిప్రాయం తీసుకోవాల్సి ఉందన్నారు.అరవింద్ సోనార్ వద్దకు ఆరోగ్య సిబ్బంది బృందాన్ని పంపినట్టు నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బాపూసాహెబ్ నాగర్‌గోజే అన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా సాధారణంగా ఉందని ధ్రువీకరించారు. అయితే, టీకాకు, ఈ అయస్కాంత శక్తికి ఎటువంటి సంబంధం లేదని వివరించారు. ఇదిలా ఉండగా, తాను యూట్యూబ్‌లో ఒక వీడియోను చూశానని, అందులో రెండో డోస్ తీసుకున్న తర్వాత తన శరీరంలో అయస్కాంత శక్తి తలెత్తిందని ఢిల్లీకి చెందిన వ్యక్తి చెబుతున్నారని ఉటంకించారు.ఒకసారి తాము కూడా ప్రయత్నిద్దామని చూసి నాణెలు, స్ఫూన్స్, ప్లేట్స్ వంటి ఇనుప వస్తువులను నాన్న శరీరానికి దగ్గరగా తీసుకెళ్లాం. దాంతో అవి నాన్న శరీరానికి అతుక్కుపోయాయి. అది చూసి అంతా షాక్ అయ్యాం.’ అని జగన్నాథ్ తనయుడు చెప్పుకొచ్చాడు. మహారాష్ట్రలో కరోనా టీకా తీసుకోవడంపై ఇప్పటికే అపోహలు ఉన్నాయి. చాలా గ్రామాల్లో వ్యాక్సిన్ వేయించుకోవాలంటే ప్రజలు భయపడుతున్నారు. ఇటువంటి తరుణంలో ఈ కథనాలు ప్రచారంలోకి రావడం ఆందోళన కలిగిస్తోంది.

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

 

Tags: Magnetic force after vaccination

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page