సమాజ హితమే భారతీయ జనతా పార్టీ లీగల్ సెల్ లక్ష్యం  జిల్లా బిజెపి లీగల్ సెల్ కన్వీనర్

0 14

నెల్లూరు  ముచ్చట్లు:
సమాజ హితమే భారతీయ జనతా పార్టీ లక్ష్యమని నెల్లూరు జిల్లా బిజెపి లీగల్ సెల్ కన్వీనర్ దాసరి ప్రసాద్ పేర్కొన్నారు. స్థానిక కోర్టు ప్రాంగణములో న్యాయవాదులకు, న్యాయవాద గుమస్తాలకు శుక్రవారం మాస్కులు, శానిటైజర్ లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం జిల్లా బిజెపి లీగల్ సెల్ కన్వీనర్ ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న చందంగా ప్రజా సంక్షేమం, ప్రజాహిత మే బీజేపీ లక్ష్యమన్నారు. కంటికి కనిపించని కరోనా వైరస్ విస్తృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో తన వంతు బాధ్యతగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. ఇటువంటి విపత్కర ఆపత్కాల సమయాలలో ప్రతి ఒక్కరు తమ వంతు సహకారం అందించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ నియమ నిబంధనలు పాటిస్తూ, కరోనా వైరస్ తో చేయించాలని సింహపురి ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్ దాసరి రాజేంద్ర గౌడ్, నెల్లూరు బార్ అసోసియేషన్ కార్యదర్శి  ఆర్. రోజా రెడ్డి, ఏ జి పి రంగరాజన్, న్యాయవాదులు దాసరి మురళి, టి సురేష్ తదితరులు పాల్గొన్నారు.

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

- Advertisement -

Tags:Bharatiya Janata Party Legal Cell Target District BJP Legal Cell Convener

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page