సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం

0 36

విశాఖపట్నం   ముచ్చట్లు:
ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను హర్షిస్తూ విశాఖలో మహిళలు జగన్ చిత్రపటానికి క్షీరాభి షేకం నిర్వహించారు. విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్దకు తరలి వచ్చిన మహిళలు జగన్ కు అభినందనలు తెలిపారు.రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, ఏడాది పాలనలోనే మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి మహిళా పక్షపాతిగా నిరూపించుకున్నారని కొనియాడారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నపటీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నారని, సున్నా వడ్డీ పథకంతో పాటు అమ్మ ఒడి పథకాలు ప్రారంభించారని తెలిపారు.రాష్ట్రంలో మహిళలు ధైర్యంగా తిరిగేందుకు.. వారికి భద్రత కల్పిస్తూ దిశ చట్టాన్ని తీసుకొచ్చారని తెలిపారు.

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

- Advertisement -

Tags:Anointed to paint CM Jagan

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page