ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు సైనికులు, ఇద్దరు పౌరుల మృతి

0 15

న్యూ ఢిల్లీ  ముచ్చట్లు:
జమ్మూకాశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. బారాముల్లా జిల్లాలోని సోపోర్‌ పట్టణంలో శనివారం జరిగిన కాల్పుల్లో ఇద్దరు సైనికులు, మరో ఇద్దరు పౌరులు మరణించారు. మరో ఇద్దరు పోలీసులు, ఓ పౌరుడికి గాయాలైనట్లు సమాచారం. ఉత్తర కాశ్మీర్‌లోని సోపూర్‌లోని అరంపోరా ప్రాంతంలో పోలీసులు, సీఆర్‌పీఎఫ్‌ సంయుక్త బలగాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఉగ్రవాదులను పట్టుకునేందుకు భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది. అయితే, దాడి వెనుక పాక్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా ఉందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

- Advertisement -

Tags:Two soldiers and two civilians were killed in the firing

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page