ఏపీ ఎస్ ఎఫ్ ఎల్ ను లాభాల బాటలో నడిపిస్తాం-ప్రజలు ఆదరించాలి

0 22

-ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ డాక్టర్ పూనూరు గౌతమ్ రెడ్డి

 

తిరుపతి ముచ్చట్లు :

 

- Advertisement -

ఆంధ్ర ప్రదేశ్ ఫైబర్ నెట్ ను లాభాల బాటలో నడిపిస్తామని తద్వారా వచ్చే ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తామని నెట్ చైర్మన్ డాక్టర్ పొన్నూరు గౌతం రెడ్డి చెప్పారు. శనివారం తిరుపతిలోని రాయల్ నగర్లో ఏపీ ఫైబర్ నెట్ కార్యాలయాన్ని ఆయన సందర్శించిన అనంతరం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని జిల్లాల కన్నా చిత్తూరు జిల్లా 70 వేల కలెక్షన్లతో అగ్రభాగాన ఉందని అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాలు, కలెక్టర్ కార్యాలయం, పరిశ్రమలు, కళాశాలలకు ఫైబర్ నెట్ కనెక్షన్ అందుబాటులో ఉన్నాయన్నారు. శ్రీ సిటీ లో సైతం ఫైబర్ నెట్ కనెక్షన్ ఇవ్వడానికి చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. మండల స్థాయి నుంచి గ్రామస్థాయిలో ప్రతి ఇంటికి ఫైబర్ నెట్ కనెక్షన్ ఇవ్వాలనేది తమ లక్ష్యమని ఒకటిన్నర సంవత్సరకాలంలో దీనిని పూర్తి చేస్తామని గౌతమ్ రెడ్డిధీమా వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం సైతం మండలం నుండి గ్రామంలోని ప్రతి ఇంటికి భూగర్భ కనెక్షన్ల ద్వారా ఫైబర్ నెట్ అందించడానికి ఆమోదం తెలిపిందన్నారు. అలాగే ప్రతి గ్రామంలో ఇంటర్నెట్ పార్కులను ఏర్పాటు చేసి అక్కడినుంచి ప్రతి ఇంటికి నెట్ కనెక్షన్ ఇవ్వడానికి ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీ ఎస్ ఎఫ్ ఎల్ ఒక ఆదాయ వనరుగా మారుతుందని వివరించారు.

 

 

 

 

గత ప్రభుత్వం దీనిని రూ. 650 కోట్ల అప్పుల్లో ముంచితే తాము లాభాల బాటలో నడిపిస్తున్నామని తెలిపారు. ఇతర నెట్వర్క్ ల కన్నా మెరుగైన, నాణ్యమైన సేవలు అందించే దిశగా ముందుకు వెళ్తున్నామన్నారు. అందులో భాగంగానే 15 ఎం బి పి ఎస్ ను అన్ లిమిటెడ్ గా రూ. 197 రూపాయలకే అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర, విశాఖలో దీనిని పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టి నెల రెండు నెలలు కాలంలోనే అభివృద్ధి బాటలో ముందుకు తీసుకు వెళ్తామన్నారు. ఇది విజయవంతమైతే 100 – 200 ఎం బి పి ఎస్ సామర్థ్యానికి తీసుకువెళతామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ఫైబర్ నెట్ లీజుకు తీసుకున్న వారు ఇంటికి కనెక్షన్ ఇవ్వడానికి అవకాశం ఉందన్నారు. త్రిబుల్ ప్లే బాక్స్ ద్వారా కేబుల్, నెట్, ఫోన్ సౌకర్యాన్ని అందించే దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయనిఒయన తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశయం మేరకు నెట్, ఫోన్ సౌకర్యాన్ని ప్రజలకు ఉచితంగా అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలు ఏపీ ఎస్ ఎఫ్ ఎల్ ను ఆదరించాలని కోరారు. అదే సమయంలో ఏపీ ఫైబర్ నెట్ ను ముందుకు తీసుకు వెళ్లిన సంస్థ కార్మికులను ఈ సందర్భంగా ఆయన అభినందించారు.

 

 

 

 

ఏపీ ఫైబర్ నెట్ లోనే కాకుండా ఇతర ప్రైవేట్ కేబుల్ నెట్ సంస్థలలో పనిచేస్తున్న సిబ్బంది కూడా కరోనా బారిన పడి మరణించారని వారి కుటుంబాలకు గౌతమ్ రెడ్డి సానుభూతి తెలియజేశారు. ఏపీ ఫైబర్ నెట్, ఇతర కేబుల్ సంస్థలో పని చేస్తున్న సిబ్బందిని కరోనా వారియర్స్ గా గుర్తించాల్సిన అవసరం ఉందని ఏపీ ఫైబర్ నెట్ చైర్మెన్ అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో నెట్వర్క్ మేనేజర్ దివాకర్ రెడ్డి, బిల్లింగ్ మేనేజర్ గోవింద్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ బిల్లింగ్ మేనేజర్ ఈశ్వర్ తేజ, ఎంటర్ప్రైజెస్ మేనేజర్ సుధాకర్ రెడ్డి, మార్కెటింగ్ మేనేజర్ నరసింహారెడ్డి అలాగే అశోక్ రెడ్డి, ఎం. కృష్ణ చైతన్య ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

Tags: We will lead the AP SFL on the path to profitability – people must support it

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page