కడప కార్పొరేషన్ విద్యా వాలంటీర్లకు ఆర్థిక సహాయం  “ఐటా”

0 17

కడపముచ్చట్లు:

 

కడప నగరంలోని కరోన మహమ్మారి వల్ల పాఠశాలలు జరగకుండా విద్య వాలంటీర్లకు జీతాలు అందడం లేదు. ఇటువంటి కష్ట కాలంలో ఐటా ఆల్ ఇండియా ఐడియల్ టీచర్స్ అసోసియేషన్ కడప నగరపాలక శాఖ తరపున 22 విద్య వాలంటీర్లకు ఒక్కకరీ కి నగదు 2,000/౼ రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగినది. కొంతయినా ఖర్చులకు సహాయం అవుతుందని, ఆ ఉద్దేశంతో పంపిణీ జరిగినది. ఈ రోజు శనివారం ఈ సమావేశానికి విచ్చేసిన రాష్ట్ర అధ్యక్షులు  అబ్దుల్ రజాక్ గారు  మాట్లాడుతూ కడప కార్పొరేషన్ శాఖ  సభ్యులు ఎంతో కృషి చేసి ప్రభుత్వ ఉపాధ్యాయుల సహాయంతో డబ్బులు పంపిణీ ఒక పుణ్య కార్యక్రమం మరియు ప్రత్యేకంగా విద్య వాలంటీర్ లకు సహాయం చేయడం మహాద్భాగ్యం అని తెలియజేశానారు. ఐటా  రాష్ట్ర ఉపాధ్యక్షులు  షాకీర్ హుస్సేన్  మాట్లాడుతూ ఒక గొప్ప ఆలోచనతో, బాధ్యతతో ఇటువంటి కష్ట కాలంలో విద్యా వాలంటీర్లకు సహాయం చేయడం మన అందరి కర్తవ్యం అని తెలియజేశారు మరియు కడప జిల్లా అధ్యక్షులు నజీర్ భాష గారు మాట్లాడుతూ విద్య వాలంటీర్ కూడా ప్రభుత్వ ఉపాధ్యాయుల లో ఒక రకంగా మన, ఫ్యామిలీ మెంబరు, అంటూ వారి సుఖదుఃఖ సమయంలో సహాయం చేయడం మన ధర్మము మరియు చేతనైన సహాయం చేయడమే మనకు పుణ్య దాయకం అని తెలియజేశారు. ఐటా కడప కార్పొరేషన్ ఇన్చార్జి అబ్బాస్ అలీ మాట్లాడుతూ ఈ కరోన కర్ఫ్యూ సమయంలో వాలంటీర్లకు మన తోటి ఉపాధ్యాయులు ఎంతో మంది వారి పేర్లు చెప్పకుండా సహాయం చేయడానికి నడుబిగిస్తూ ముందుకు వచ్చారు.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

 

Tags:Financial assistance to Kadapa Corporation Education Volunteers
“Ita”

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page