కరోన కట్టడికి ప్రత్యేక చర్యలు- సర్పంచ్ శ్రీనివాసులురెడ్డి

0 72

రామసముద్రం ముచ్చట్లు:

 

ప్రపంచ వ్యాప్తంగా గడగడలాడిస్తున్న కరోన మహమ్మారిని నివారించడం కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు కెసిపల్లి సర్పంచ్ దిగువపల్లి శ్రీనివాసులురెడ్డి అన్నారు. శనివారం పంచాయతీ పరిధిలోని వనగానిపల్లి గ్రామంలో ఇద్దరికి కరోన సోకింది. ఈ క్రమంలో కరోన నివారణకు మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ బాషా ఆదేశాల మేరకు కరోన నిర్దారణ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కడ చూసినా కరోన రక్కసి కోరలు చాపడంతో ప్రజారోగ్యమే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. అదే బాటలో మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ బాషా కూడా ప్రజారోగ్యానికి పెద్దపీట వేశారన్నారు. ఈ క్రమంలో కరోన పాజిటివ్ వచ్చిన వారిని పరామర్శించారు. అనంతరం కరోన సోకిన ఇద్దరిని 108 ద్వారా కరోన కేర్ సెంటర్ కు తరలించారు. కరోనకు గురైన వారికి సకాలంలో మందులు అందించి అండగా ఉంటామని వారికి భరోసా ఇచ్చారు. ప్రజలు కూడా సామాజిక దూరాన్ని పాటిస్తూ మాస్కులు ధరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి, కెసిపల్లి, మాలేనత్తం ఏఎన్ఎంలు సుగుణమ్మ, శ్రీవాణి, విఆర్ఏ మహ్మద్ రఫీ, ఆశ వర్కర్లు మంజుల, రాధమ్మ, స్థానిక నేతలు బాబు, ఎల్లారెడ్డి, విటి.జయచంద్ర, శివకుమార్, వెంకటరమణరెడ్డి, ఎల్. మునస్వామి, శివశంకర్, గంగప్ప, వాలింటర్లు పుష్పవతి, దినకర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

Tags: Special measures for corona building- Sarpanch Srinivasureddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page