కారుకు అద్దె చెల్లిస్తామని మోసాలకు పాల్పడే ముఠా అరెస్టు  29 కార్లును స్వాధీనం చేసుకున్న పార్వతీపురం పట్టణ పోలీసులు

0 23

విజయనగరం ముచ్చట్లు:

 

పార్వతీపురం పోలీసులు కారుకు అద్దె చెల్లిస్తామని మోసాలకు పాల్పడే ముఠాను  అరెస్టు చేసారు. వారినుంచి 29 కార్లును స్వాధీనం చేసుకున్నారు.  స్వాధీనం చేసుకున్న కార్లు విలువ రూ. 2 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.  ఇద్దరు మోసగాళ్ళు అరెస్టు అయ్యారు. పరారీలో ఉన్న మరో నిందితుడి గురించి గాలింపు జరుపుతున్నారు. వివరాలు ఇలా వున్నాయి. శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలం తురాయివలస గ్రామానికి చెందిన పిన్నింటి రాజేష్ (26) అనే వ్యక్తి మే నెల 29 న పార్వతీపురం పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేస్తూ పార్వతీపురం పట్టణం వైకేఎం కాలనీకు చెందిన మర్రాపు చంద్రమౌళి (29) అనే వ్యక్తి తన షిప్ట్ విడిఐ కారు ఎపి 394జి 3846ను ప్రతీ నెలకు రూ. 29 వేలు అద్దె చెల్లించేందుకు లోలుగ శివ రామకృష్ణ (ఎ-2) అనే వ్యక్తి ద్వారా అగ్రిమెంటు కుదుర్చుకున్నట్లు తెలిపాడు. అద్దెను గత కొన్ని నెలలుగా చెల్లించకపోవడంతో తన కారును అప్పగించాలని కోరినప్పటికీ, చంద్రమౌళి  ఇవ్వకపోవడంతో అనుమానం వచ్చి, ఆరా తీయడంతో తన కారును నారాయణపురంకు చెందిన ఒక వ్యక్తి వద్ద తనఖా పెట్టినట్లు పిర్యాదు చేసాడు. ఈ ఫిర్యాదుపై పార్వతీపురం పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.నిందితుడు మర్రాపు చంద్రమౌళి ని  పార్వతీపురం వైకేఎం కాలనీలోని వారింటి వద్ద అదుపులోకి తీసుకొని, విచారణ చెయ్యగా, నిందితుడు వేరువేరు వ్యక్తుల నుండి 29 కార్లను అద్దెకు తీసుకొని, వాటిని తన అవసరాల కొరకు ఇతరుల వద్ద   తనఖా పెట్టినట్లుగా అంగీకరించాడు.

 

- Advertisement -

బత్తిలి, పాతపట్నం, శ్రీకాకుళం ప్రాంతాల్లో తన స్నేహితులు బొబ్బిలికి చెందిన సీమంతుల రవి, సీతంపేటకు చెందిన లోలుగ శివ రామకృష్ణ ల సహకారంతో కార్లను అద్దెకు తీసుకొని, వాటిని పార్వతీపురం, బొబ్బిలి, బలిజిపేట ప్రాంతాల్లోని ఇతరుల వద్ద రూ.2 నుండి 2.5 లక్షలకు తనఖా పెట్టి, వారి నుండి డబ్బులు తీసుకొని తన అవసరాలను తీర్చుకొనే వారన్నారు. నిందితుడు చెప్పిన వివరాల ప్రకారం పార్వతీపురం పిఎస్ పరిధిలో 9 కార్లును, బొబ్బిలి పిఎస్ పరిధిలో 4 కార్లను, బలిజిపేట పిఎస్ పరిధిలో 10 కార్లను, విజయనగరం పట్టణంలో 6 కార్లును (మొత్తం 29 కార్లును) స్వాధీనం చేసుకున్నారు. పార్వతీపురం పట్టణ పోలీసులు స్వాధీనం చేసుకున్న 29 కార్లలో 3 కార్లు పార్వతీపురం పట్టణ పిఎస్ కు సంబందించినవి గాను, 10 కార్లును బత్తిలి పోలీసు స్టేషనుకు సంబంధించినవి గాను, 6 కార్లు సీతంపేట పోలీసు స్టేషనుకు సంబంధించినవి గాను, 1 కారు చీడికాడ పోలీసు స్టేషనుకు సంబంధించినది గాను, 2 కార్లు పిఎం పాలెంకు సంబంధించినవి గాను, 1 కారు ఎంవిపి కాలనీ పోలీసు స్టేషనుకు సంబంధించినవి గాను ఇప్పటి వరకు గుర్తించామన్నారు. ఇంకనూ మిగిలిన 6 కార్లు ఎవరికి చెందినవో తెలియలేదన్నారు. ఈ 29 కార్లును మధ్యవర్తుల సమక్షంలో స్వాధీనం చేసుకోవడం జరిగిందని, స్వాధీనం చేసుకున్న కార్లును గురించి సంబంధిత స్టేషను హౌస్ అధికారులకు తదుపరి చర్యలు తీసుకొనేందుకు సమాచారం అందించామని, స్వాధీనం చేసుకున్న 29 కార్ల విలువ రూ. 2 కోట్లు ఉంటుందని జిల్లా ఎస్పీ రాజకుమారి తెలిపారు., బొబ్బిలికి చెందిన సీమంతుల రవి (ఎ-2) ప్రస్తుతం పరారీలో ఉన్నారని  ఎస్పీ తెలిపారు.

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

 

Tags:’Gang arrested for fraudulently paying car rental
Parvathipuram town police seized 29 cars

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page