కేంద్ర మంత్రి వీడ్కలు… విజయసాయి కామెంట్స్

0 21

విజయవాడ ముచ్చట్లు :

 

ఏపీ సీఎంవైఎస్ జగన్ రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ సీఎం జగన్ కారు వరకూ వచ్చి వీడ్కోలు పలకడం విశేషం. రెండు రోజులు పర్యటనలో భాగంగా శుక్రవారం ఉదయం సీఎం జగన్ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో భేటీ అయ్యారు. పలు అంశాలపై ఆయనతో చర్చించారు. భేటీ అనంతరం ముఖ్యమంత్రి జగన్‌తో కలసి బయటికి వచ్చిన గోయల్ సీఎం జగన్ కారు వరకూ వచ్చి వీడ్కోలు చెప్పారు. ఆ వీడియోను వైసీపీ ఎంపీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ గారు ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈరోజు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి శ్రీ పియూష్ గోయెల్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై వారి మధ్య చర్చ జరిగింది. అనంతరం సీఎం శ్రీ జగన్ గారికి కారు వరకు వచ్చి గోయల్ వీడ్కోలు పలికారు.’’ అంటూ ఆ వీడియోను పోస్టు చేశారు.అయితే విజయసాయి రెడ్డి ట్వీట్‌పై నెటిజన్లు షాకింగ్ రియాక్షన్లు ఇస్తున్నారు. విజయసాయిపై సెటైర్లతో విరుచుకుపడుతున్నారు. అయితే ప్రత్యేక హోదా వచ్చినట్టేనా? అని కొందరు.. ఇంతకీ ఢిల్లీ వెళ్లింది సొంత పనిమీదనా.. లేక రాష్ట్రం పనిమీదనా? మరికొందరు ప్రశ్నించారు. అదేమీ ఏ1కి ఇచ్చిన గౌరవం కాదు.. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇచ్చిన గౌరవం.. కేంద్ర మంత్రి సంస్కారం అంటూ నెటిజన్లు అదిరిపోయే రేంజ్‌లో కామెంట్లు పెడుతున్నారు.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

Tags: Union Minister’s Farewell … Vijayasai Comments

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page