కేసీఆర్ ను ఎదుర్కోవడానికే రైట్ తో చెట్టాపట్టాల్

0 16

హైదరాబాద్ ముచ్చట్లు :

 

మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. శాసనసభ సభ్యత్వానికీ ఆయన రాజీనామా చేశారు. శామీర్‌పేటలోని తన ఇంటి నుంచి అనుచరులతో గన్‌పార్క్ చేరుకొన్న ఆయన ఏనుగు రవీందర్‌రెడ్డి, తుల ఉమతో కలిసి.. అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించారు. అనంతరం స్పీకర్ కార్యాలయంలో ఈటల రాజీనామా పత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా ఈటల మాట్లాడుతూ తన రాజీనామా పత్రాన్ని అసెంబ్లీ అందించాలని భావించానన్నారు. కానీ ఆ అవకాశం దక్కలేదన్నారు.నేరుగా స్పీకర్ కి ఇద్దాం అనుకున్న కానీ స్పీకర్ కరోనా అడ్డం పెట్టుకొని తనను కలవలేదని ఆరోపించారుఅసెంబ్లీలో అంతా నియంతృత్వం కొనసాగుతుందన్నారు. గతంలో ఉన్న పార్లమెంటరీ సంప్రదాయాలు అన్నీ తుంగలో తొక్కారని విమర్శించారు.

 

 

 

- Advertisement -

మాజీ ఎమ్మెల్యే, ఉద్యమ కారుడు ఏనుగు రవీందర్ రెడ్డి నీ కూడా అనుమతించలేదన్నారు. అసెంబ్లీలో కెసిఆర్ రాసి ఇచ్చిన స్క్రిప్ట్ మాత్రమే అమలవుతుందన్నారు. మరొకటి అమలు కాదని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఈ వెకిలి చేష్టలు, నకిలీ ప్రయత్నాలు ఆపకపోతే ఎప్పుడో ఒకప్పుడు ఆయనకే ఎదురు తిరుగుతాయని హెచ్చరించారు. హూజురాబాద్ లో ఇన్నాళ్లు పెన్షన్ లేదు కానీ ఇప్పుడు ఆగ మేఘాల మీద ఎన్నికల కోసం పెన్షలు ఇస్తున్నారని విమర్శించారు. ప్రజలను మభ్యపెట్టడానికి ఈ పని చేస్తున్నారని ఈటల మండిపడ్డారు. తనకు మద్దతు తెలపక పోతే ఆపెస్త అంటున్నారు. హుజూరాబాద్ చైతన్యం గడ్డ ఇలాంటి వాటిని తొక్కి పడేసి ధర్మాన్ని గెలిపిస్తారు. ధర్మ అధర్మం, డబ్బు సంచులకి ఆగౌరవానికి మధ్య జరిగే పోరాటం ఇది…తన DNA అంతా లెఫ్ట్.. కానీ ఈ రోజు నియంత పాలన అంతం అనే ఒకే ఒక లక్ష్యం గా రైట్ పార్టీలో చేరుతున్నానని తెలిపారు. మళ్లీ గెలిచి చూపిస్తానని ఈటల సవాల్ చేశారు.

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

 

Tags: Chettapattal with Wright to counter KCR

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page