కొరటాల ఐసోలేషన్ సెంటర్ కు పెరుగుతున్న ఆదరణ

0 4

తిరుమల ముచ్చట్లు :

 

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కరోనా మహమ్మారికి మనదేశంలో ముందు చూపు లేని పాలకుల నిర్లక్ష్యంతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుత పరిస్థితుల్లో రొండవ దశలో ప్రజలు అత్యధిక శాతం మరణించారని, మనిషికి మనిషే తోడుగా సేవా కార్యక్రమాలు చేస్తుండడం అభినందనీయమని, సీఐటీయూ నాయకురాలు ఆర్. లక్ష్మీ, వేణుగోపాల్ అన్నారు. ఈ తరుణంలో మంగళం పరిధిలోని రణధీరపురంలో కొరటాల సత్యనారాయణ విజ్ఞాన కేంద్రం, ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఉచిత ఐసోలేషన్ పేద ప్రజలే సాటి పేదవారికి బాసటగా నిలుస్తూ విరివిగా తమ ఉదారతను చాటుకుంటుంన్నారు. ఉచిత ఐసోలేషన్ సెంటర్ కు శనివారం కష్టజీవి రుక్కు
ద్రాక్ష 12 కేజీలు, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు లక్ష్మీ కూరగాయలు ను ట్రస్ట్ కన్వీనర్ నాగార్జున, వేణు, ఎస్ఎఫ్ఐ నాయకుడు అక్బర్ లకు అందజేసారు. ఉపాధ్యాయ నాయకురాలు K.వరలక్ష్మి 3000/-రూ అందచేశారు.దాతలకు ట్రస్ట్ కన్వీనర్ నాగార్జున కృతజ్ఞతలు తెలిపారు.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

 

Tags: Growing popularity for the Struggle Isolation Center

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page