గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి

0 16

ఏలూరు ముచ్చట్లు:
పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు లో గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి చెందినట్లు కొవ్వూరు రూరల్ ఎస్ఐ కె. రామకృష్ణ తెలిపారు. కాపవరం హైవేపై హోటల్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు గ్రామ కార్యదర్శి పోలీసులకు సమాచారం అందించారు. డీఎస్పీ బి. శ్రీనాథ్, రూరల్ సీఐ ఎం. సురేష్, ఎస్ఐ కె. రామకృష్ణ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. రాత్రి సమయంలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో మృతి చెంది ఉండవచ్చన్నారు. మృతుడి వివరాలు తెలియరాలేదన్నారు. మృతుడు గెడ్డం కల్గి, గ్రీన్ కలర్ షర్ట్, కాఫీ కలర్ లుంగీ ధరించి ఉన్నాడని, వయస్సు 40 ఏళ్లు ఉంటాయన్నారు. మృతదేహాన్ని కొవ్వూరు ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు. వివరాలు తెలిసినవారు పోలీస్టేషన్లో సంప్రదించాలన్నారు. గ్రామ కార్యదర్శి దూళిపాళ బాల సుబ్బలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ కె. రామకృష్ణ తెలిపారు.

 

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

- Advertisement -

Tags:One person was killed when an unidentified vehicle collided with him

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page