చోక్సికి షాక్

0 11

న్యూఢిల్లీ ముచ్చట్లు:
పీఎన్‌బీ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వజ్రాల వ్యాపారీ మెహుల్ చోక్సీకి భారీ షాక్‌ తగిలింది.  క్యూబాకు  పారిపోతూ  డొమినికాలో  అరెస్ట్‌ అయిన చోక్సీకి  డొమినికా హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. చోక్సీ బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. ప్లైట్ రిస్క్ కారణాలతో బెయిల్ ఇవ్వలేమని  అక్కడి న్యాయమూర్తి వైనెట్ అడ్రియన్ రాబర్ట్స్ స్పష్టం చేశారు. అలాగే  చోక్సీపై ఇంటర్‌పోల్ రెడ్ నోటీసు కూడా  ఉందని  న్యాయవాది లారెన్స్  వాదించారు. కాగా పీఎన్‌బీ బ్యాంకులో 13,500 కోట్ల రూపాయల స్కాం కేసులో నిందితుడగా ఉన్న చోక్పీ 2018లో అంటిగ్వాకు పారిపోయిన సంగతి తెలిసిందే. మెహుల్‌ చోక్సీ అంటిగ్వా, బార్బుడా పౌరసత్వాన్ని అనుభవిస్తున్న చోక్సీ మే 23న  ఆంటిగ్వానుంచి పారిపోతూ డొమినికాలో అరెస్టయ్యాడు. దీంతో అక్కడ విచారణను ఎదుర్కొంటున్నారు. మరోవైపు చోక్సీని అక్రమ వలసదారుగా అక్కడి ప్రభుత్వం ప్రకటించింది.

 

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

- Advertisement -

Tags:Shock to Choksi

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page