జిల్లాలో బాలకార్మిక వ్యవస్థను రూపుమాపాలి  జిల్లా కలెక్టరు సి.హరికిరణ్

0 12

బాలకార్మిక వ్యవస్థ నిర్ములనా ప్రచార పోస్టర్లను ఆవిష్కరించిన కలెక్టర్

కడప ముచ్చట్లు:

- Advertisement -

జిల్లాలో బాలకార్మిక వ్యవస్థను రూపుమాపాలని జిల్లా కలెక్టరు సి.హరికిరణ్ ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన దినోత్సవం సందర్భంగా ఆర్తి హోం చైల్డ్ లైన్ నోడల్ ఆర్గనైజేషన్ విజయ్ ఫౌండేషన్ ట్రస్ట్ వారు
ముద్రించిన గోడ పత్రికలను కలెక్టరేట్లోని తన చాంబర్లో కలెక్టర్ సి.హరికిరణ్  ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… జూన్ 12వ తేది అంతర్జాతీయ బాలకార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవంగా పాటిస్తున్నాము. జిల్లాలో
బాలలెవరూ బాలకార్మికులుగా మారకుండా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. బాలకార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించాల్సిన అవసరం ఉందన్నారు. బాలలెవరికీ కరోనా సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కడప జిల్లా ను బాలకార్మికులులేని జిల్లాగా చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా పిల్లలకు పాలు ఇస్తున్న తల్లులంతా కరోనా వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయుంచుకోవాలని కోరారు. ఆర్తి హోం అధ్యక్షులు పి.వి.సంధ్య  మాట్లాడుతూ…  గతసంవత్సర కాలంగా కరోనా వల్ల అనేక కుటుంబాలు పేదరికంలో పడ్డాయని, అందువల్ల బాలలు బాలకార్మికులుగా మారే అవకాశం ఏర్పడిందన్నారు. కాబట్టి కరోనాతో పోరాడుతునే బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి అందరం కలిసిపనిచేయాలని, ఆ విధంగా చేసిననాడే కడప జిల్లాను బాలల స్నేహ పూర్వక జిల్లాగా  రూపొందించడం సాధ్యమౌతుందని పేర్కొన్నారు. ఎక్కడైనా బాలలు ఇబ్బంది పడుతున్నట్లు గమనిస్తే చైల్డ్ లైన్ 1098 ఉచిత ఫోన్ సౌకర్యాన్నిఉపయోగించుకోవాలని కోరారు.   ఈ కార్యక్రమంలో ఆర్తి హోం సభ్యులు మరియు చైల్డ్ లైన్ 1098 సిబ్బంది రాఘవేంద్ర, విజయా, రవి తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

Tags:The child labor system in the district should be eradicated
District Collector C. Harikiran

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page