తడి, పొడి చెత్త వేరుగా అందించండి….  నగర పరిశుభ్రత కు సహకరించండి.

0 33

కాలువల్లో చెత్త వెయ్యొద్దు
…  రెండు చెత్త బుట్టలు వాడండి.
కమిషనర్ గిరీషా

తిరుపతి  ముచ్చట్లు:

- Advertisement -

,ప్రజలు నగరపాలక సంస్థ పారిశుద్ధ్య సిబ్బందికి తడి, పొడి చెత్త వేర్వేరుగా అందించి, నగర పరిశుభ్రత కు సహకరించాలని కమిషనర్ గిరీషా అన్నారు. క్లాప్ (క్లీన్ ఆంధ్రప్రదేశ్) కార్యక్రమంలో భాగంగా చెత్త సేకరణ, పారిశుద్ధ్యం పై కమిషనర్ శనివారం నాడు ప్రజలకు అవగాహన కల్పించారు. గిరిపురంలో పర్యటించిన  కమిషనర్ చెత్త సేకరణకు ఎన్ని గంటలకు వస్తున్నారు, తడి, పొడి చెత్త వేర్వేరుగా ఇస్తున్నారా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. మీరందరు తడి, పొడి చెత్త వేర్వేరుగా ఇస్తే ఆ చెత్తను తూకివాకం లో చేస్తున్న ప్రొసెసింగ్ గురించి ప్రజలకు వివరించారు. నగరంలో ఎక్కడా కూడా చెత్త కుండీలు లేకుండా చేశామని, మీరందరు కూడా రెండు చెత్త కుండీలు వినియోగించాలన్నారు. కొంతమంది కాలువల్లో చెత్త వేస్తున్నారని, అలా వేయడం వలన ఎక్కడికక్కడ డ్రైనేజీ కాలువల్లో మురుగునీరు ఆగి పోయి ఇబ్బందులు ఎదురావుతున్నాయన్నారు. అందరూ చెత్త ను తమ పారిశుద్ధ్య సిబ్బందికి ఇచ్చి నగర పరిశుభ్రత కు సహకరించాలని పిలుపునిచ్చారు. యూజర్ చార్జీలు సిబ్బందికి చెల్లించాలని, ప్రస్తుతం 30 రూపాయల యూజర్ చార్జీలను 60 రూపాయలు కు పెంచారని ప్రజాలి సహకరించి సకాలంలో చెల్లించాలన్నారు.  ఆయా వీధుల్లో వెళ్లే వాహనాలు ప్రతి రోజు ఒకే టైమ్ కు వెళ్లేలా చూడాలని, తద్వారా ప్రజలు ఒకే టైమ్ లో చెత్త ఇచ్చి వారి పనులు చేసుకునేందుకు వీలుంటుందన్నారు. దుకాణాల వద్ద ఖచ్చితంగా రెండు చెత్త కుండీలు ఉండేలా చూడాలని, ప్రమాదకరమైన చెత్త ను వేసేందుకు కూడా ఒక చెత్త కుండీ ఏర్పాటు చేయాలన్నారు. చెత్త కుండీలు పెట్టని వారికి, కాలువల్లో, రోడ్లపై చెత్త వేసేవారికి అపరాధ రుసుము విధించాలని సిబ్బందిని ఆదేశించారు. కమిషనర్ వెంట ఆర్.ఎఫ్.ఓ. జ్ఞానసుందరం, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య, ఇన్స్పెక్టర్ కృష్ణయ్య, మెస్త్రి సతీష్, శానిటరీ సెక్రెటరీ లు,  తదితరులు ఉన్నారు.

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

Tags:Provide wet and dry garbage separately ….
Contribute to city sanitation.

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page