దేశంలో రోజురోజుకి తగ్గుముఖం పడుతున్న కరోనా మహమ్మారి

0 11

న్యూ ఢిల్లీ ముచ్చట్లు:

దేశంలో కరోనా వైరస్ మహమ్మారి రోజురోజుకి తగ్గుముఖం పడుతుంది. అయితే కరోనా మరణాలు మాత్రం తగ్గడం లేదు.  శుక్రవారం 1920477 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 84332 కొత్త కేసులు వెలుగుచూశాయి. వరుసగా ఐదోరోజూ లక్ష దిగువనే కేసులు నమోదయ్యాయి. 90 వేల దిగువకు కేసులు నమోదు కావడం ఈ నెలలో ఇది రెండోసారి కావడం గమనార్హం.అయితే గత మూడు రోజులుగా మరణాల్లో మాత్రం పెరుగుదల కనిపిస్తోంది. పలు రాష్ట్రాలు మరణాల లెక్కను సవరిస్తుండటంతో ఈ సంఖ్యలో భారీ పెరుగుదల కనిపిస్తోంది. 24 గంటల వ్యవధిలో మరో 4002 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 29359155కి చేరగా.. 367081 మంది బలయ్యారు. ఇక నిన్న ఒక్కరోజే 121311 మంది కరోనా నుంచి కోలుకున్నారు. సుమారు నెల రోజులుగా కొత్త కేసులు కంటే రికవరీలే అధికంగా ఉంటున్నాయి. అలాగే 2.79 కోట్ల మందికిపైగా వైరస్ నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం రికవరీ రేటు 95.07 శాతానికి చేరగా.. క్రియాశీల రేటు 3.68 శాతానికి తగ్గింది. ఇప్పటివరకు మొత్తం 249600304 మందికి వ్యాక్సిన్లు వేయడం జరిగిందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

Tags:The corona epidemic is declining day by day in the country

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page