పాతబస్తీ లో దారుణ హత్య

0 14

హైదరాబాద్ ముచ్చట్లు :

 

హైదరాబాద్ పాతబస్తీ నిర్మాణంలో ఉన్న ఓ కాంప్లెక్స్ నాలుగవ అంతస్తులో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన హుస్సేనీహాలం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళితే ..  పాతబస్తీ శాలిబండ పాత ఆశా థియేటర్ ప్రాంగణంలో నూతన కాంప్లెక్స్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి.  శనివారం ఆ నిర్మాణంలో ఉన్న కాంప్లెక్స్ నాలుగవ అంతస్తులో ఒక వ్యక్తి హత్యకు గురయ్యాడన్న సమాచారం మేరకు చార్మినార్ ఇంచార్జి ఏసీపీ భిక్షం రెడ్డి, హుస్సేనీహాలం ఇన్స్పెక్టర్ నరేష్,కాలాపత్తర్ ఇన్ స్పెక్టర్ సుదర్శన్ లు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.  శవ పంచనామ నిర్వహించిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. మృతుడు వివరాలు ఇంకా తెలియరాలేవని, మృతుడు ఎవరో తెలిస్తే కానీ , హాత్య ఎందుకు జరిగింది ? ఎవరు చేశారు ? అనే విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు పేర్కొన్నారు.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

 

Tags: Brutal murder in the old town

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page