పేదలను ఆదుకోవడానికి ముందుకు రావడం అభినందనీయం…

0 19

– కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు మహ్మద్ ఖుతుబొద్దిన్ పాషా

మెట్ పెల్లిముచ్చట్లు:

 

- Advertisement -

కరోనా కష్ట కాలం లో ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకోవడానికి ముందుకు రావడం అభినందనీయమని కాంగ్రెస్ మెట్ పల్లి పట్టణ అధ్యక్షుడు మహ్మద్ ఖుతుబొద్దిన్ పాషా అన్నారు. శనివారం సూర్య సేల్స్ కార్పొరేషన్ డైరెక్టర్ సుశీల అగర్వాల్ వారి సహకారంతో ఆశా వర్కర్లకు మాస్కులు, శానిటైజర్ లను పంపిణీ చేశారు. అదేవిధంగా కొన్ని పేద కుటుంబాలకు ఒక్కొక్కరికి 25 కిలోలు బియ్యంతో పాటు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ తో సామాన్య, పేద, మధ్య తరగతి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వారిని ఆదుకోవడం సాటి మనిషి బాధ్యత అని, వారిని ఆదుకోవడానికి ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా ముందుకు రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మెట్పల్లి పట్టణ కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు జెట్టి లక్ష్మణ్ పట్టణ కాంగ్రెస్ మైనారిటీ వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ అజారుద్దీన్ నాయకులు ఉదయ్ జుబేర్ సురేష్ అరుణ్ శీను తరులు పాల్గొన్నారు.

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

Tags:Coming forward to support the poor is commendable …

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page